శత్రువులను ఖతం చేసే 'ఖండేరి'
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 27 Sept 2019 7:47 PM ISTముంబై: భారత్ తన రక్షణను రోజురోజుకు బలోపేతం చేసుకుంటుంది. నేవీ బలోపేతంలో భాగంగా మొత్తం ఆరు జలాంతర్గాములు సమకూర్చుకోవాలని 2017లో భావించారు. అందులో రెండోది రేపు సముద్ర ప్రవేశం చేయనుంది. అదే ఖండేరి జలాంతర్గామి. దీనికి నేవీ అధికారులు 'సైలెంట్ కిల్లర్' అని పేరు పెట్టారు. రేపు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సమక్షంలో ఇది సముద్ర ప్రవేశం చేయనుంది.
శత్రువులకు దొరకని ఆధునిక పరిజ్ఞానం ఐఎన్‌ఎస్ ఖండేరి సొంతం. దీని పొడవు 67.5మీటర్లు. అత్యంత శక్తిమంతమైన ఇంజిన్లు దీని సొంతం. అంతేకాక భారీ బ్యాటరీలుంటాయి. సముద్ర ఉపరితలం నుంచి 350 మీటర్ల లోతు వరకు ఇది పోగలదు. సముద్ర గర్భంలో ఉన్నప్పుడు గంటకు 20 నాటికల్ మైళ్లు అంటే 37 కి.మీలు పయనిస్తుంది. సముద్ర ఉపరితలం మీద ఉన్నప్పుడు గంటకు 11 నాటికల్ మైళ్లు అంటే..20 కి.మీ పయనిస్తుంది. శత్రువులకు అంతుపట్టని సాంకేతిక పరిజ్ఞానం ఖండేరి సొంతమని నేవీ అధికారులు చెబుతున్నారు.