స్టే ఉన్న మునిసిపాలిటీలపై హై కోర్టులో విచారణ?అసలు ఏం జరగనుంది..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Nov 2019 5:45 AM GMT
స్టే ఉన్న మునిసిపాలిటీలపై హై కోర్టులో విచారణ?అసలు ఏం జరగనుంది..?

నేడు మరోమారు స్టే ఉన్న మున్సిపాలిటీలపై హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే గడువుముగిసిన మున్సిపాలిటీలన్నింటికి రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఈ మేరకు రాష్ట్రంలోని 77 మున్సిపాలీటిలకు హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియ చట్ట నిబంధనలకు అనుగుణంగా చేయలేదని దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ కోర్టు తీర్పు చెప్పింది.

దీంతో న్యాయపరమైన అవరోధాల తొలగింపునకు ఆదేశాలివ్వాలని అదనపు అడ్వొకేట్‌ జె. రామచంద్రారావు, ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో అక్టోబర్‌ 22న ధర్నాసనాన్ని కోరారు. సింగిల్‌ జడ్జి దగ్గరే పరిష్కరించుకోవాలని డివిజన్‌ బెంచ్‌ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు స్టే ఎత్తివేయాలని సింగిల్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. విచారణ అనంతరం పెండింగ్‌లో ఉన్న 89 పిటిషన్‌లను సింగిల్ బెంచ్‌...డివిజన్ బెంచ్‌కు బదిలీ చేసింది. దీంతో ఇవాళ హైకోర్టు సింగిల్‌ బెంచ్, స్టే ఎత్తివేతపై నిర్ణయం తీసుకోనుంది.

Next Story
Share it