పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో మృతి
By తోట వంశీ కుమార్Published on : 12 Aug 2020 7:17 PM IST

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో.. హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. బుధవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. పాలెం శ్రీకాంత్ రెడ్డికి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన గతంలో కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్దికి పార్టీలకతీతంగా కృషి చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడే పాలెం శ్రీకాంత్‌రెడ్డి.
Next Story