విజయవాడ: కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ఓ కార్మికుడి ప్రాణాలు పోయాయి. దసరా ఏర్పాట్లలో భాగంగా..పాత రాజగోపురం షెడ్డును నిర్మిస్తుండగా కార్మికుడు జారి పడ్డాడు. దీంతో ..పశ్చిమ బెంగాల్‌కు చెందిన జయదీప్ అనే కార్మికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే..రక్తం మరకలను శుభ్రం చేయకుండా..ఇసుక వేసి కవర్ చేశారు దేవస్థానం సిబ్బంది. దీంతో..రక్తపు మరకలు తొక్కుకుంటూ భక్తులు గుళ్లోకి వెళ్తున్నారు. ప్రమాదంపై కాంట్రాక్టర్, అధికారులు గోప్యత పాటిస్తున్నారు. కార్మికుల విషయంలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే .. ఈ ప్రమాదం జరిగిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.