పారాసిటమాల్‌తో ఎత్తుగడ.. చివరకు
By అంజి Published on 26 March 2020 2:10 AM GMTహైదరాబాద్: 'పారాసిటమాల్‌తో ఏమార్చారు!' అంటూ ఈనాడు దినపత్రిక కథనం రాసింది. ఆ కథనం మేరకు.. 17 రోజుల కిందట ఇండోనేషియా నుంచి ఢిల్లీ అక్కడి నుంచి కరీంనగర్‌కు వచ్చిన 10 మంది విదేశీయులు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నారు. వారందరికీ కరోనా పాజిటివ్ అని తేలింది. వారితో పాటుగా వచ్చిన మరో వ్యక్తికి కూడా కరోనా వచ్చిందని తెలిసింది. ఇప్పటివరకు వీరు కలిసిన 500 మందిలో కొందరిని హోమ్ క్వారంటైన్, మరికొందరిని ఆస్పత్రులకు తరలించారు.
ఈ నెల 9న 10 మంది ఇండోనేషియా వాసులు ఢిల్లీకి వచ్చారు. అయితే వారు అప్పటికే తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఎయిర్‌పోర్టులో అనారోగ్యంతో పట్టుబడితే ఆస్పత్రికి తరలిస్తారన్న భయంతో విమానం దిగక ముందు, దిగాన నాలుగైదు పారసిటమాల్ టాబ్లెట్ వేసుకున్నారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరూ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత 13న సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎస్9 బోగీలో ఎక్కి తెలంగాణ రాష్ట్రం రామగుండంలో దిగారు. అక్కడి నుంచి ఓ వాహనంలో కరీంనగర్‌కు వచ్చారు.
వారిలో ఒకరికి తీవ్ర జ్వరం, దగ్గు రావడంతో వెంటనే ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు వైద్యులు.. అతనికి కరోనా పాజిటివ్ తేల్చారు. మిగతావారికి కూడా పరీక్షలు చేయడంతో కరోనా పాజిటివ్ అనితేలింది. దీంతో ఏపీ, తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. సంపర్క్ క్రాంతి ఎస్9 బోగీలో ప్రయాణించిన 82 మంది గద్వాల, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో దిగారని తెలిసింది.
రామగుండం, కరీంనగర్ కమిషనరేట్ల పరిధిలో 300 మందిని హోమ్‌క్వారంటైన్ చేశారు. వీరిలో 130 మంది ప్రత్యేక వార్డులకు తరలించారు. ఆ బోగీలో ప్రయాణించిన ఇద్దరు కానిస్టేబుళ్లను క్వారంటైన్ చేశారు. ఇక వాహనం డ్రైవర్ హోంక్వారంటైన్ నిరాకరించడంతో.. కేసులు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలించారు.
ఈ నెల 28న బాధితుల క్వారంటైన్ ముగుస్తుంది. అప్పుడు వీరిలో ఎవరికీ వైరస్ లేదని తేలితే ఇబ్బంది లేనట్లే.
Next Story