రాజస్థాన్:  పోఖ్రాన్ ఎడారిలో  ఇండో – ఫ్రాన్స్ సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. వీటికి ‘శక్తి’ అని పేరు పెట్టారు. ఉగ్రవాదులను పట్టుకోవడం, ఎదుర్కోవడం, శత్రు సైనికుల దాడులు నుంచి కాపాడుకుంటూ ప్రతి దాడులు చేయడం..అనే దానిపై సైనికులు విన్యాసాలు చేస్తున్నారు. వ్యూహాలు ఎలా రచించాలి అనే దానిపై కూడా ప్రణాళికలు రచిస్తారు. ఈ సైనిక విన్యాసాలతో ఇండో – ఫ్రాన్స్ మధ్య బంధం మరింత బలోపేతం అవుతుందని తెలుస్తోంది.

Image

Image

Image

Image

పోఖ్రాన్ లో ఫ్రాన్స్ తో కలిసి విన్యాసాలు చేస్తుంటే..మరోవైపు అసోంలో జపాన్ సైనికులతో కలిసి కూడా భారత సైన్యం విన్యాసాలు చేసింది.  ‘ధర్మ గార్డియన్ 2019’ పేరుతో అసోంలో  ఇండో – జపాన్ సైనికులు విన్యాసాలు చేశారు.

Image

Image

Image

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.