అయ్యో.. స్మృతి మంధానకు ఎంత క‌ష్ట‌మొచ్చింది

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 April 2020 4:08 PM GMT
అయ్యో.. స్మృతి మంధానకు ఎంత క‌ష్ట‌మొచ్చింది

క‌రోనా వైర‌స్‌(కొవిడ్‌-19) ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి క్రీడారంగం కుదేలైంది. క‌రోనా ముప్పుతో ప‌లు క్రీడాటోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని టోర్నీలు ర‌ద్దు అయ్యాయి. క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రం 21 రోజుల పాటు దేశ‌వ్యాప్త లాక్‌డౌన్ ను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిదే.

ఇదిలా ఉంటే.. విదేశాల నుంచి వ‌చ్చిన వారు త‌ప్ప‌కుండా 14 రోజుల పాటు సెల్ప్ క్వారంటైన్ ఉండ‌మ‌ని ప్ర‌భుత్వాలు సూచిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల‌తో క‌రోనా మ‌హమ్మారిని త‌రిమికొట్ట‌వ‌చ్చ‌ని నిపుణులు భావిస్తున్నారు. ఇప్ప‌టికే చాలా మంది ప్ర‌ముఖులు హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. తాజాగా ఈ జాబితాలో భార‌త స్టార్ మ‌హిళా క్రికెట‌ర్ స్మృతి మంధాన చేరింది.

మొన్న‌టి వర‌కు ముంబైలో ఉన్న మంధాన ఇటీవ‌లే సొంత‌గ‌డ్డ సాంగ్లీకి చేరుకుంది. ముంబైలో క‌రోనా కేసులు న‌మోద‌వుతుండ‌డంతో.. గృహ నిర్భంధంలో ఉండాల‌ని వైద్యులు ఆమెకు సూచించారు. సెల్ప్ క్వారంటైన్‌లో ఉన్న మంధాన‌ను రోజువారీగా ప‌రీక్షిస్తుంటామ‌ని వైద్యులు తెలిపారు. క‌రోనాకు ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగానే మంధానాను హోమ్ క్వారంటైన్‌లో ఉంచామ‌ని తెలిపారు.

క‌రోనా వైర‌స్‌పై పోరాటానికి భార‌త మ‌హిళా క్రికెట‌ర్లు మిథాలీ రాజ్ రూ.10 ల‌క్ష‌లు, వ‌ర్థ‌మాన క్రికెట‌ర్ రిచా ఘోష్ రూ.1 ల‌క్ష విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా మ‌న‌దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 1637 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ్వ‌గా.. 38 మంది మృత్యువాత ప‌డ్డారు.

Next Story
Share it