ఇక నుంచి అన్ని రైళ్లలో ఈ సేవలు ఏర్పాటు
By సుభాష్
ఈ మధ్యన రైల్లో దోపిడిలు, హత్యలు, రైలు ప్రమాదాలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఇక రైలు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా ఇండియన్ రైల్వే శాఖ మరిన్ని సేవలు కల్పించనుంది. 2022 మార్చి కల్లా రైల్వే స్టేషన్లో, రైలులోని అన్ని బోగీల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 530 రైల్వే స్టేషన్లలోసీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్లలో, రైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు టెండర్లను ఆహ్వానించినట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 500 కోట్ల నిధులు వచ్చాయన్నారు. 6వేలకు పైగా స్టేషన్లు, 58వేలకు పైగా బోగిల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు రైల్వే శాఖ రూ.2వేల కోట్లు కేటాయించినట్లు ఆయన పేర్కొన్నారు.
ప్యాసింజర్ల ప్రైవసీకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కెమెరాలను కామన్ ఏరియాల్లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రైళ్లలో చోరీలు, హత్యలు, ఇంకేవైన ఘటనలకు పాల్పడిన నిందితులను ఫేసియల్ రికగ్నేషన్, ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ సాయంతో గుర్తించనున్నట్లు చెప్పారు. ఇక రైళ్లు కూడా ఆన్‌టైమ్‌కు నడిచేలా చేయడానికి ఆటోమేటిక్ చార్ట్, ప్రిపరేషన్ వంటి ఇస్రో సహాయంతో ముందుకెళ్లనున్నట్లు వివరించారు. ఇంక రైల్వేబోర్డు చైర్మన్ యాదవ్ పదవీ కాలం కూడా మరో ఏడాదిలో పొడిగించారు. 2020 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు పదవీ కాలం పొడిగించారు. కాగా, 2019 జనవరి 1వ తేదీన వీకే యాదవ్ రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.