అద‌ర‌గొట్టిన టీమిండియా బౌల‌ర్లు.. విజ‌యం మ‌న‌దే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Jan 2020 4:24 PM GMT
అద‌ర‌గొట్టిన టీమిండియా బౌల‌ర్లు.. విజ‌యం మ‌న‌దే..!

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజ‌యంతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 1-1తో సమం చేసింది. దీంతో సిరీస్ ఫలితం కోసం బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదిక‌గా జ‌రిగే చివ‌రి వ‌న్డే వ‌ర‌కూ ఆగాల్సిందే. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 340 పరుగులు చేసింది. అనంత‌రం 341 ప‌రుగుల‌ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ మరో 5 బంతులు మిగిలి ఉండగానే 304 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆసీస్ బ్యాట్స్‌మెన్‌లో కెప్టెన్‌ ఫించ్ 33, లబుషెన్ 46 పరుగులు చేయగా, స్టీవ్ స్మిత్ 98 ప‌రుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు తీయగా, సైనీ, జడేజా, కుల్దీప్ యాదవ్ త‌లా 2 వికెట్లు పడగొట్టారు. ఒక‌ బుమ్రా ఒక వికెట్ ద‌క్కించుకున్నాడు.

అంత‌కుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 42, కోహ్లీ 78, శిఖర్ ధవన్ 96, లోకేశ్ రాహుల్ 80 పరుగులు చేయ‌డంతో భారత్ భారీ స్కోరు చేసింది. అసీస్ బౌల‌ర్ల‌లో ఆడ‌మ్ జంపా మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. రిచ‌ర్డ్ స‌న్ 2 వికెట్లు నేల‌కూల్చాడు.

Next Story