అశ్లీల చిత్రాలను చూడటంలో ఆ నాలుగు దేశాలే టాప్..

By రాణి  Published on  3 Jan 2020 11:55 AM GMT
అశ్లీల చిత్రాలను చూడటంలో ఆ నాలుగు దేశాలే టాప్..

అశ్లీల చిత్రాలను చూసే వారి సంఖ్య పెరిగిపోతుండటంతో పాటు..అలాంటివి చూసి నేరాలు చేసే వారి సంఖ్య కూడా నానాటికి పెరుగుతుండటంతో ఆ సైట్లపై నిషేధం విధించింది మన దేశ ప్రభుత్వం అయినా కూడా ఇప్పటికీ పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్న దేశాల్లో మనదేశానిదే టాప్ ప్లేస్ అంటే నమ్ముతారా ? నిజమే మనదే టాప్ లో ఉందట. ఈ విషయాన్ని పోర్న్ హబ్ స్వయంగా వెల్లడించింది. పోర్న్ చూస్తున్న భారతీయుల్లో 89శాతం స్మార్ట్ ఫోన్ల ద్వారానే వీక్షిస్తున్నట్లు ప్రముఖ పోర్న్ వీడియోల వెబ్ సైట్ పోర్న్ హబ్ ఒక నివేదికలో తెలిపింది. డెస్క్‌టాప్‌, ల్యాప్‌టాప్‌ కంప్యూటర్ల ద్వారా చూసేవారి సంఖ్య బాగా తగ్గింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురిలో ముగ్గురు మొబైల్ ఫోన్లలో పోర్న్ చూస్తున్నారట. పోర్న్ హబ్ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్ల ద్వారా నీలిచిత్రాలు చూస్తున్న దేశాల్లో ఇండియా తర్వాత ప్లేస్ అమెరికా కొట్టేసింది.

అమెరికన్లు 81 శాతం, బ్రెజిలియన్లు 79 శాతం, జపనీయులు 74 శాతం పోర్న్ చూస్తున్నారట. అంటే పోర్న్ వీడియోలు చూడటంలో ఇండియా, అమెరికా, బ్రెజిల్, జపాన్ దేశాలు టాప్ 4లో ఉన్నాయి. అలాగే ఎక్కువ డేటా వినియోగంలోనూ భారతీయులదే పై చేయి. మొబైల్ డేటాను నెలకు సగటున 9.8 జీబీ వినియోగిస్తున్నారని ఎరిక్ సన్ వెల్లడించింది. 2024 నాటికి ఇది 18 జీబీ అవుతుందని ఎరిక్ సన్ అంచనా.

Next Story