రాహుల్ కు బీసీసీఐ షాక్.. కివీస్‌తో టెస్టు సిరీస్‌కు భారత జట్టు ఎంపిక
By Newsmeter.Network
కివీస్ తో టెస్టు సిరీస్ లో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. కాలికి గాయంతో ఓపెనర్ రోహిత్ శర్మ కివీస్ పర్యటన నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా హిట్ మ్యాన్ స్థానంలో పుల్ ఫామ్ లో ఉన్న లోకేష్ రాహుల్ కు అవకాశం ఇస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు అనూహ్యంగా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ కు ఓటేశారు. తిరిగి సుదీర్ఘ పార్మాట్ లోకి రావాలనుకున్న రాహుల్ ఆశలు అడియాశలు అయ్యాయి.
ఇక వన్డే జట్టులో చోటు దక్కించుకున్న మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాకు టెస్టు సిరీస్‌లోనూ అవకాశం కల్పించారు. టీ20ల్లో అదరగొట్టిన యువ పేసర్ నవదీప్ సైనీ కూడా టెస్టు జట్టులోకి ఎంపికయ్యాడు. మరోవైపు రంజీలో గాయపడిని ఇషాంత్ శర్మను కూడా జట్టులోకి ఎంపిక చేశారు. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తేనే జట్టులోకి వస్తాడని బీసీసీఐ పేర్కొంది.
భారత టెస్టు జట్టు :
విరాట్ కోహ్లి(కెప్టెన్), అజింక్యా రహానే(వైస్ కెప్టెన్), శుబ్‌మన్ గిల్, ఛటేశ్వర్ పూజారా, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రిషభ్ పంత్(వికెట్ కీపర్), అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, ఇషాంత్ శర్మ