ఇటలీ లో చిక్కుపోయిన విద్యార్థులకు ఊరట..స్పందించిన భారత ప్రభుత్వం

By రాణి  Published on  12 March 2020 6:52 AM GMT
ఇటలీ లో చిక్కుపోయిన విద్యార్థులకు ఊరట..స్పందించిన భారత ప్రభుత్వం

భారతదేశానికి చెందిన 84 మంది భారతీయ విద్యార్థులు ఇటలీలోని రోమ్ ఫ్యుమిసినో ఎయిర్ పోర్టులో చిక్కుకుపోయారు. వీరిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన విద్యార్థులే ఎక్కువగా ఉన్నారు. ఇటలీలోని 'ల సపియన్జ యూనివర్శిటీ'లో ఇంటర్నేషనల్ లా (అంతర్జాతీయ న్యాయశాస్ర్తం) చదువుతున్న ఈ విద్యార్థులంతా..ఇటలీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లేందుకు పయనమయ్యారు. తీరా ఎయిర్ పోర్టుకు వచ్చాక..వారందరికీ కరోనా లేదని వైద్య ధృవీకరణ పత్రాలను తీసుకువస్తేనే విమానం ఎక్కనిస్తామని చెప్పడంతో..విద్యార్థులంతా నిరాశకు గురయ్యారు.

Also Read : రక్షణ పాఠాలు నేర్పాల్సిన వాడే..లైంగిక వేధింపులకు పాల్పడితే..

అసలే అక్కడ కరోనా బాధితులకే సరైన వైద్య సదుపాయాలు లేవు. అందులోనూ ఇప్పుడు వీరంతా అక్కడ వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే చాలా ఖర్చవుతుంది. ఇంతలో సోషల్ మీడియా వారికి ధైర్యాన్నిచ్చింది. విద్యార్థుల్లో ఎక్కువమంది తెలుగు వారుండటంతో..వారు మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ..వారి పరిస్థితిని వివరించారు. వైద్య పరీక్షలు చేసి, తమకు సర్టిఫికేట్ ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.



అలా విద్యార్థులు పోస్ట్ చేసిన వీడియోలను మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, ఇటలీలోని భారత రాయబార కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ..వారికి సహాయం చేయాలని కోరారు. ఈ వీడియోలపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ స్పందించింది. ఇటలీలో చిక్కుకుపోయిన విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. వారి నుంచి నమూనాలను సేకరించి..పరీక్షలు చేసి వైరస్ లేదని తేలిన తర్వాతే ఇండియాకు వచ్చేందుకు అనుమతిస్తామని తెలిపింది. ఇక్కడికి వచ్చాక 14 రోజుల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాకే ఇళ్లకు పంపిస్తామన్నారు.

Also Read : కరోనా ఎఫెక్ట్‌ : క్రికెటర్లు చేయకూడని పనులు ఇవే..



ఇటలీలోని భారత రాయబార కార్యాలయం కూడా విద్యార్థుల అంశంపై స్పందించింది. ఇటలీలో ఉన్న విద్యార్థులు మార్చి 10వ తేదీ, ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వెళ్లాలని విమాన టిక్కెట్లు కొనుక్కున్న విద్యార్థులంతా తమ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, పాస్‌పోర్ట్ నంబర్, యూనివర్శిటీ పేరు మొదలైన వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలని ఇటలీలోని భారత రాయబార కార్యాలయం కోరింది.



Next Story