గెలవాలి..సిరీస్ కొట్టాలి..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Oct 2019 8:14 AM GMT
గెలవాలి..సిరీస్ కొట్టాలి..!

పుణే: విశాఖ టెస్ట్‌లో ఘన విజయం సాధించిన కోహ్లీ సేన మరో విజయంపై కన్నేసింది. రెండో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ తీసుకుంది. రోజులు గడిచే కొద్దీ పిచ్‌ బౌలింగ్ కు అనుకూలించే అవకాశముంది. దీంతో..కోహ్లీ బ్యాటింగ్ వైపు మొగ్గు చూపాడు. హనమ విహారిని రెండో టెస్ట్‌కు సెలక్ట్ చేయలేదు. బౌలర్‌ ఉమేష్ యాదవ్‌ను తీసుకున్నారు. ఇక..పంత్‌కు కూడా నిరాశే ఎదురైంది. మొదటి టెస్ట్‌లో సాహా విఫలమైనప్పటికీ..మరో అవకాశం కల్పించారు. దీంతో పంత్ ఆశలపై నీళ్లు చల్లినట్లైంది. ఇక..అందరి దృష్టి మొదటి టెస్ట్‌ లో ఇరదీసిన రోహిత్ శర్మ మీదనే ఉంది. ఈ టెస్ట్‌లో కూడా రోహిత్ రాణిస్తాడనే అనుకుంటున్నారు. ఇక..కెప్టెన్‌ కోహ్లీకి ఇది 50వ టెస్ట్. దక్షిణాఫ్రికా కూడా స్పిన్నర్‌ పీట్‌ను దూరం పెట్టి..పేసర్‌ అన్రిచ్‌ను తీసుకున్నారు. రెండో టెస్ట్‌లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే ఆలోచనలో టీమిండియా ఉంది.

Next Story
Share it