యూఎన్‌ఓకు పూర్తి బకాయిలను చెల్లించిన భారత్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  12 Oct 2019 6:09 AM GMT
యూఎన్‌ఓకు పూర్తి బకాయిలను చెల్లించిన భారత్‌

యూనైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ (యూఎన్‌ఓ)కి చెల్లించాల్సిన పూర్తి స్థాయి బకాయిల్ని చెల్లించామని యూఎన్‌ఓలో భారత శాశ్వత రాయబారి సయీద్ అక్బరుద్దీన్ అన్నారు. మొత్తం 193 సభ్య దేశాల్లో కేవలం 35 దేశాలు మాత్రమే తమ బకాయిల్ని చెల్లించాయన్నారు. బకాయిలు చెల్లించిన 35 దేశాల్లో భారత్ కూడా ఉందని సయీద్‌ అక్బరుద్దీన్‌ తెలిపారు.

కాగా నిధులు అయిపోవడంతో యూఎన్‌ఓ తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ మేరకు యూఎన్‌ఓకు నిధులు చెల్లించిన జాబితాను భారత శాశ్వత రాయబారి సయీద్‌ అక్బరుద్దీన్‌ ట్వీటర్‌లో ఉంచారు. ఈ జాబితాలో నార్వే, జర్మనీ, ఆస్ట్రేలియా, ఐస్‌లాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, సింగపూర్ తదితర దేశాలు ఉన్నాయి. కాగా అధిక మొత్తంలో నిధులు బకాయి పడ్డ దేశాల్లో అమెరికా, మెక్సికో, ఇరాన్‌, అర్జెంటీనా, బ్రెజిల్‌ ఉన్నట్టు సమాచారం.



Next Story