టెస్టుల్లో చేజారిన అగ్ర‌స్థానం..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 May 2020 9:22 AM GMT
టెస్టుల్లో చేజారిన అగ్ర‌స్థానం..

టీమ్ఇండియాకు పెద్ద షాక్ త‌గిలింది. టెస్టుల్లో త‌న నెంబ‌ర్ వ‌న్ స్థానాన్ని కోల్పోయింది. ఐసీసీ తాజాగా ప్ర‌క‌టించిన టెస్టు ర్యాంకింగ్స్ లో ఏకంగా మూడో స్థానానికి ప‌డిపోయింది. ఆస్ట్రేలియా మ‌ళ్లీ అగ్ర‌స్థానానికి చేర‌గా.. న్యూజిలాండ్ రెండవ స్థానంలో కొన‌సాగుతుంది. అయితే.. ఈ మూడు జ‌ట్ల మ‌ధ్య ఒక్క రేటింగ్ పాయింట్ తేడా మాత్ర‌మే ఉండ‌డం గ‌మనార్హం. ఆస్త్రేలియా 116, న్యూజిలాండ్ 115, భార‌త్ 114 పాయింట్ల‌తో కొన‌సాగుతున్నాయి..

2016 అక్టోబ‌ర్ నుంచి టెస్టుల్లో అగ్రస్థానంలో కొన‌సాగుతున్న కోహ్లీ సేన .. మూడేళ్ల త‌రువాత మొద‌టి స్తానాన్ని కోల్పోయింది.తాజా రాంక్సింగ్స్ కోసం 2019, మే నుంచి ఆడిన మ్యాచుల 100 శాతం, అంత‌కు ముందు రెండేళ్ల మ్యాచుల 50 శాతం రేటింగ్ పాయింట్లను ఆధారంగా తీసుకున్నారు. ఇక టెస్టుల్లో అగ్ర‌స్థానం చేజారిన‌ప్ప‌టికి ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ప‌ట్టిక‌లో భార‌త్ అగ్ర‌స్థానంలోనే కొన‌సాగుతుంది.

ఇక టీ20ల్లో భార‌త జ‌ట్టు ఓ స్థానాన్ని మెరుగుపరుచుకుని మూడో ర్యాంకుకు చేరుకోగా.. తొలిసారి ఆస్ట్రేలియా ఈ ఫార్మాట్‌లో అగ్ర‌స్థానాన్ని కైవ‌సం చేసుకుంది. ఇక ఇంగ్లాడ్ రెండో స్థానంలో కొన‌సాగుతుండ‌గా.. పాకిస్థాన్ ఏకంగా అగ్ర‌స్థానం నుంచి నాలుగో స్థానానికి ప‌డిపోయింది.

Next Story