ఢిల్లీ: “ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని” ఓ తెలుగు కవి అన్న మాటలు నిజమవుతున్నాయి. ప్రపంచ దేశాల్లో భారతీయులు విస్తరిస్తున్నారు. అంతేకాదు..తమ ప్రతిభాపాటవాలతో మువ్వెన్నెల జెండా కీర్తి ప్రతిష్టలను పెంచుతున్నారు. తాజాగా ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన అంచనా ప్రకారం 2019కి విదేశాలకు వలస వెళ్లే వారిలో భారతీయులే టాప్‌గా ఉన్నారు. యూఎన్‌ఓ ప్రకారం ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లిన వారు 272 మిలియన్లు. దీనికి సంబంధించి ‘ఇంటర్నేషనల్ మైగ్రాంట్ స్టాక్‌ -2019’ను యూఎన్‌ఓ విడుదల చేసింది.

ప్రపంచ దేశాలకు వివిధ కంట్రీల నుంచి వలస వెళ్లిన వారిలో మూడో వంతు మంది 10 దేశాలకు సంబంధించిన వారు ఉండటం గమనార్హం. 2019లో ఇప్పటి వరకు ఇండియా నుంచి 17.5 మిలియన్ల మంది పలు దేశాలకు వలస వెళ్లారు. వలస వెళ్లిన వారి జాబితాలో ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. రెండో స్థానంలో మెక్సికో 11.8 మిలియన్లతో ఉంది. ఇక చైనా 10.7 మిలియన్ల మందితో మూడో స్థానంలో ఉంది.

ఇక భారత్ విషయానికి వస్తే 2019లో 5.1 మిలియన్ల విదేశీయులకు సెల్టర్‌ ఇచ్చింది. ఇందులో మహిళలు అధికంగా ఉండటం విశేషం.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.