ముఖ్యాంశాలు

  • పొట్టి ఫార్మ‌ట్‌లో చేజింగ్ లో అత్య‌ధిక విజ‌యాలు
  • గ‌తంలో ఆస్ట్రేలియా పేరిట రికార్డ్

టీమిండియా టీ20ల్లో ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా పేరిట ఉన్న రికార్డును బద్ద‌లు కొట్టింది. బంగ్లాదేశ్‌తో గురువారం జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. అయితే.. టీ20ల్లో ఛేజింగ్‌లో టీమిండియాకు ఇది 41వ విజయం కావడం విశేషం.

కాగా.. టీమిండియా పొట్టి ఫార్మ‌ట్‌లో 61వ సార్లు ఛేజింగ్‌కు దిగగా 41 విజయాల్ని అందుకుంది. 40 విజయాలతో ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. అయితే ఆసీస్‌ 69 సార్లు సెకండ్‌ బ్యాటింగ్‌ దిగి 40 ప‌ర్యాయాలు గెలిచింది. అంటే ఆస్ట్రేలియా కంటే తక్కువ మ్యాచ్‌ల్లోనే టీమిండియా ఛేజింగ్‌ రికార్డును త‌న పేరిట లిఖించుకున్న‌ది.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

2 comments on "ఆస్ట్రేలియా రికార్డు బ‌ద్ద‌లు కొట్టిన టీమిండియా.!"

Comments are closed.