భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికాలో ప్రత్యేకంగా నిర్వహించాలని తీర్మానం

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికాలో ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు నిర్ణయించారు.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2023 10:10 AM GMT
August 15, National Day of Celebration, US, India

 భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికాలో ప్రత్యేకంగా నిర్వహించాలని తీర్మానం

భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమెరికాలో కూడా ప్రత్యేకంగా నిర్వహించుకోవాలని అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు నిర్ణయించారు. ఇండియా ఇండిపెండెన్స్‌ డేను అక్కడ 'నేషనల్‌ డే ఆఫ్‌ సెలబ్రేషన్‌'గా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు అక్కడి చట్ట సభలో ఓ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి కొందరు అమెరికన్ సభ్యులు సహ ప్రాయోజకులుగా వ్యవహరించారు. ఆగస్టు 15న ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్యాల్లో సంబురాల దినోత్సవంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.

రెండు దేశాలు పంచుకునే ప్రజాస్వామ్య విలువలే బంధానికి, భాగస్వామ్యానికి మూలమని అమెరికా కాంగ్రెస్ సభ్యులు పేర్కొన్నారు. జూన్‌లో భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించారు. అప్పుడు ఈ తీర్మానానికి బీజం పడినట్లు తెలుస్తోంది. ఈ తీర్మానాన్ని అమెరికా చట్ట సభలో కాంగ్రెస్ సభ్యుడు శ్రీ తానేదార్‌ ప్రవేశపెట్టగా.. దానికి కాంగ్రెస్‌ బడ్డీ కార్టర్, బ్రాడ్‌ షర్మాన్‌ సహ ప్రాయోజకులుగా వ్యవహించారు. అధికారిక పర్యటనతో ఇరుదేశాల మధ్య విశ్వాసం, పరస్పర అవగాహన, చట్ట పాలన, మానవహక్కులను గౌరవించడం వంటి అంశాలపై అవగాహన పెరిగిందని తీర్మానంలో వెల్లడించారు. భారతీయులతో కలిసి ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకెల్లి అన్ని దేశాల్లో శాంతి, స్థిరత్వం, సంపద వృద్ధి సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతీయ మూలాలున్న చాలా మంది అమెరికన్లు ప్రభుత్వ అధికారులుగా, సైనికులుగా, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా ప్రజాజీవితాన్ని మెరుగు పరుస్తున్నారని తీర్మానంలో కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు. అమెరికా చట్టాన్ని రక్షిస్తూ.. దేశంలోని వైవిద్యాన్ని కాపాడుతున్నారని చెప్పారు. ఈ క్రమంలో భారతీయులతో కలిసి ప్రజాస్వామ్య విలువలను నలబెట్టడానికి ఈ తీర్మానం ఉపయోగపడుతుందని అమెరికా చట్ట సభలో కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు.

Next Story