పెరుగుతున్న వ్యతిరేకత.. స్పందించని ప్రభుత్వం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  15 Oct 2019 10:47 AM GMT
పెరుగుతున్న వ్యతిరేకత.. స్పందించని ప్రభుత్వం

హైదరాబాద్‌: ఆర్టీసీ సమ్మె 11వ రోజుకు చేరుకుంది. కార్మికులు బలిదానాలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించకపోవడంపై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. పాతబస్తీ హైకోర్టు న్యాయవాదులు ఆర్టీసీ కార్మికులకు సంఘీభావము తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకత తెలిపారు. కేసీఆర్‌ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరగకపోతే నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుందన్నారు. త్వరగా ఆర్టీసీ కార్మికుల షరతులను ఆమోదించి వారికి న్యాయం చేయాలని హైకోర్టు గేటు వద్ద న్యాయవాదులు నిరసన తెలిపారు.

మరోవైపు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ కంటోన్మెంట్‌ డిపో ముందు కార్మికుల ధర్నాకు దిగారు. ధర్మాలో సీపీఎం పొలిట్‌ బ్యూరో మెంబర్‌ బివి రాఘవులు పాల్గొని మద్దతు తెలిపారు. ఒక ఉద్యమాన్ని నడిపిన ఉద్యమ నాయకుడు ఆర్టీసీ సమ్మెని నిర్దాక్షిణ్యంగా అణచాలని చూడడం అన్యాయమని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని బివి రాఘవులు అన్నారు. కార్మికుల సమస్యలను తీర్చవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉందన్నారు. కార్మికుల పట్ల కేసీఆర్‌ వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని బివి రాఘవులు ఆరోపించారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటానికి సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సీపీఎం పొలిట్‌ బ్యూరో మెంబర్‌ బివి రాఘవులు తెలిపారు.

Next Story