పాక్‌లో పెరిగిన కరోనా మృతుల సంఖ్య
By Newsmeter.Network
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. ఆ దేశం.. ఈ దేశం అని లేకుండా అన్ని దేశాల్లోనూ కరోనా మహమ్మారి పాగావేసింది. దీంతో ప్రపంచ దేశాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే కరోనా బాధితుల సంఖ్య ఏడు లక్షలకు చేరగా, 32వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. ఇదిలాఉంటే పాకిస్థాన్‌లోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి భారిన పడి వేల సంఖ్యలో ప్రజలు ఆస్పత్రుల బాట పడుతున్నారు. లాక్ డౌన్ వ్యూహాన్ని అమలు చేసినా మృతుల సంఖ్య తగ్గడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు పాకి స్థాన్‌లో 1600 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో 17మంది మృతిచెందినట్లు అక్కడి వైద్యులు వెల్లడించారు.
Also Read :ఎనిమిది నెలల గర్భిణి 100కి.మీ నడక.. చివరికి..
ఇదిలా ఉంటే దక్షిణాది దేశాలతో పోలిస్తే పాక్‌లోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో 1050కి పైగా కేసులు నమోదు కాగా.. 27 మంది మృతి చెందారు. భారత్‌లో లాక్ డౌన్ పకడ్బందీగా నిర్వహించడం వల్లనే కేసులు తగ్గాయని వైద్యులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షౌయబ్ అక్తర్ భారత్ ప్రజలను చూసి నేర్చుకోండి అంటూ పాకిస్థాన్ ప్రజలకు హితవుసైతం పలికారు. ఇదిలా ఉంటే పాక్‌లో పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు అక్కడి ప్రసార మాధ్యమాల్లో కథనాలు వెలువడుతున్నాయి.
Also Read :ఏప్రిల్ 7 నాటికి కరోనా ఫ్రీ తెలంగాణ సాధ్యమేనా? కేసీఆర్ వ్యాఖ్యలు నిజమెలా అవుతాయి?