ఆ వయసు మధ్యలో వారికే మానసిక రుగ్మతలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 7:21 AM GMT
ఆ వయసు మధ్యలో వారికే మానసిక రుగ్మతలు

బహుముఖ వృత్తులు, నిత్యం సోషల్‌మీడియాలో కుస్తీ. ఇతర యాప్‌లతో కుస్తీపట్టడంతోపాటు ఉద్యోగ, వ్యాపారాలు, చదువులు వివిధ రకాల పనుల్లో క్షణం తీరిక లేని బిజీ. దీంతో ..భాగ్యనగర వాసుల్లో ఇటీవలికాలంలో మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయని నిపుణులు గుర్తించారు . మానసిక రుగ్మతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని కాస్మోస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్ బిహేవియరల్‌ సైన్స్‌ నిపుణుల తాజా అధ్యయనంలో తేలింది.

అయితే ..ఇది ఎక్కువగా 18-45 ఏళ్ల మధ్యనున్నవారే అధికంగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఈ వయో గ్రూపులో ఉన్న వారిలో ఈ లక్షణాలు అత్యధికంగా గమనించనట్లు సైన్స్‌ నిపుణులు తెలిపారు. చాలామంది తమ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మునిగితేలుతూ..తమ మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపటం లేదని తెలుస్తోంది.

రోజులో కొద్దిసేపు యోగా, ధ్యానం, నడక వంటి వ్యాయామానికి ప్రాధాన్యతనివ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే మానసిక ఒత్తిడిమాయం అవుతుందని సైన్స్ నిపుణులు పేర్కొన్నారు. అలాగే.. సామాజిక మాధ్యమాల్లో రోజుకు అరగంటకు మించి గడపరాదని సూచించారు. రోజు మానసిక విశ్రాంతికి ప్రాధాన్యతనివ్వటం తప్పనిసరి అని తెలిపారు.

Next Story