విలీనాన్ని వదులుకున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమే: అశ్వత్థామ రెడ్డి
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 23 Oct 2019 7:15 AM GMTహైదరాబాద్: ప్రభుత్వ విలీనం విషయంలో మేము వెనక్కి తగ్గలేదన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి. ఆర్టీసీ కార్మికులు విలీనం డిమాండ్‌ను వదులుకున్నారని ప్రభుత్వం చెప్పిన విధంగా మేం ఎక్కడా చెప్పలేదన్నారు. కోర్టులో మేము కానీ, మా తరఫు న్యాయవాదులుగానీ ఆర్టీసీ విలీనం అవసరం లేదని చెప్పినట్టు నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమని అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీకి చట్ట బద్దత లేదు అని.. చర్చల కోసం మాకు ఇప్పటి వరకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. ప్రభుత్వ కమిటీ ఎవరితో చర్చిస్తుందో ముందుగా చెప్పాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. కంటి తుడుపు కమిటీలతో కాలయాపన అవుతోందని విమర్శించారు. వెంటనే సంఘాల నేలను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయాలన్నారు. లేని పక్షంలో సమ్మెను తీవ్రతరం చేస్తామని అశ్వత్థామరెడ్డి అన్నారు. దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్‌లో ఆర్టీసీ ధూం ధాం కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ కన్వీర్ అశ్వత్థామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు పాల్గొన్నారు.