అలా జ‌రిగితే అప్పుడు యాక్టింగ్ చేస్తా - త‌రుణ్ భాస్క‌ర్

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 Oct 2019 6:32 AM GMT
అలా జ‌రిగితే అప్పుడు యాక్టింగ్ చేస్తా - త‌రుణ్ భాస్క‌ర్

పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్ గా తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తరుణ్ భాస్కర్. ఆత‌ర్వాత ఈ న‌గ‌రానికి ఏమైంది..? అనే సినిమా తెర‌కెక్కించారు. విభిన్న క‌థాంశంతో రూపొందిన ఈ సినిమా ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోలేదు. ఆత‌ర్వాత ఏ సినిమాని డైరెక్ట్ చేయ‌నున్నాడు అనుకుంటే.. హీరోగా మీకు మాత్రమే చెప్తా అంటున్నాడు. నవంబర్ 1 న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ ట‌ర్న‌డ్ హీరో తరుణ్ భాస్క‌ర్ తో ఇంట‌ర్వ్యూ మీ కోసం..

విజయ్ ఫోన్ చేసి తరుణ్ నువ్వే హీరో అంటే నమ్మారా?

అస్సలు నమ్మలేదు. జోక్ చేయకురా అన్నాను. నిజంగానే ఈ సినిమాకి నీలాంటి వాడే కావాలని పట్టు బట్టి మరీ ఒప్పించాడు నన్నువిజయ్. తాను చేయాలంటే ప్రెజెంట్ తనకి డేట్స్ ఖాళీ లేవు, అలా అని సినిమాని వదిలేదమ్మా అంటే వేరే ఇండస్ట్రీకి ఈ స్టోరీని ఇచ్చేయడం విజయ్‌కి ఇష్టం లేక ఓకే చేశాడు.

ఈ సినిమా కోసం ఏమైనా కష్టపడ్డారా?

ముందు నువు ఎలా ఉన్నావో అలా ఉంటే చాలు అన్నాడు కానీ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఒరేయ్ కొంచెం తగ్గాలిరా నువ్వు అన్నాడు. ఎలాగూ నేను కూడా తర్వాతి సినిమా కోసం రీసెర్చ్ చేస్తూ ఖాళీ గానే ఉన్న.. టైం దొరికింది, కష్టపడి తగ్గా.

డైరక్టర్ నుంచి హీరోగా మారారు.. భయం వేయలేదా రాంగ్ స్టెప్ ఏమో అని?

నేను చాలా క్లారిటీగా ఉన్నా ముందు నుంచి. సెట్‌లో కూడా అసిస్టెంట్ డైరెక్టర్స్‌కి హెల్ప్ చేస్తా. వేరే సినిమా సెట్స్‌కి వెళ్ళి కొత్త విషయాలు నేర్చుకుంటుంటా. కానీ డైరెక్షన్ అనేది నా ప్యాషెన్. నేను ఏ పనైనా చేస్తా.

షార్ట్ ఫిలిం డైరెక్టర్స్ అంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయేమో కదా?

అవునండి చాలా ఉంటాయి. నాకు చాలా కంఫర్ట్‌గా ఉంది. ఏదైనా చేసేస్తారు వాళ్ళు. నేను కూడా కొన్ని రోజులు ట్రావెల్ చేశా కదా.

ముందు ఈ సినిమా కథ విన్నప్పుడు ఎలా అనిపించింది..?

కథ వింటున్నప్పుడు నాకు తెలీదు ఈ సినిమాలో నేనొక రోల్ ప్లే చేస్తానని. విజయ్ దగ్గరకి స్టోరీ వచ్చింది, వచ్చి వినమంటే ఫ్రెండ్లీ నేచర్‌తో వెళ్లి 2 గంటలు కథ విన్నా. వినగానే చెప్పా చాలా రెలెవెంట్‌గా బావుంది విజయ్ కథ.. మంచి సీన్స్ తో బాగా రాసాడు అని చెప్పా.

ట్రైలర్‌లో మీ స్లాంగ్ 'పెళ్లి చూపులు' లో విజయ్‌లా ఉంది అని కంపేర్ చేస్తున్నారు. మీరేమంటారు.?

సినిమాలో తెలంగాణ స్లాంగ్ పెద్దగా టచ్ లేదనుకుంటా ఇప్పటివరకు. అందుకే ఎవరు ఆ స్లాంగ్ ట్రై చేసిన విజయ్‌తో కంపేర్ చేస్తున్నారు. ఏదైనా హ్యాపీ నే. మా విజయ్ తోనే కదా కంపేర్ చేస్తున్నది.

ఇన్ని రోజులు డైరెక్టర్‌గా వెనుక నుంచి ప్రొమోషన్స్ చేసారు. ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది?

చాలా టైర్డ్ గా అనిపిస్తుంది. కాకపోతే అలవాటు అయినా విషయమే కదా. 'పెళ్లి చూపులు' టైంలో కూడా కొత్త కాబట్టి ప్రొమోషన్స్ కోసం చాలా ఇంట‌ర్వ్యూస్‌ ఇవ్వాల్సొచ్చింది. అలా అలవాటుంది. ఇక ఇప్పుడు అంటే నా బాధ్యత.

ఈ సినిమా తో కొత్తగా ఏమైనా చెప్తున్నారా?

హా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతిదీ పబ్లిక్ చేసేస్తున్నాం. ఒక ఇన్స్టాగ్రామ్ ఐడీతో ఒక పర్సన్ గురించి మొత్తం చెప్పేయొచ్చు అనేంతగా మారిపోయాము మనం. సో ఏది ఎంత వరకు ప్రైవసీ అనే దాని గురించి ఎంటర్టైనింగ్‌గా రెండు గంటల పాటు చూపించబోతున్నాం

గోమఠం, అనసూయ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి?

గోమఠం పాత్ర ఇంతకీ ముందలానే ఉండబోతుంది. కాకపోతే ఇంకా చాలా ఉంటుంది. ఇప్పుడేం చెప్పలేను. ఇంటరెస్టింగ్ గా, సెన్సిబుల్ గా చాలా మంచి క్యారెక్టర్ రాసాడు షమ్మీర్ .

సినిమా సైబర్ క్రైమ్ కిందకేమైనా వస్తుందా?

ఒక సీన్ వస్తే వస్తుందేమో అంతే.

సెట్‌లో డైరెక్టర్‌గా ఉన్నారా ? యాక్టర్‌గా ఉన్నారా?

డైరెక్టర్ గా అప్పుడప్పుడు ఈగో బయటికొచ్చినా అది కావాలి ఇది కావాలి అని, అదేమి బయటకి రాకుండా ఉండటమే నా క్యారెక్టర్ కి ఎదుగుదల అనుకుని యాక్టర్ గానే ఉన్నా.

సినిమా కోసం ఏమైనా సలహాలిచ్చారా?

లేదండి. నా జడ్జిమెంట్ కరెక్ట్ కాదని నా ఫీలింగ్ అలాంటప్పుడు పక్కనోళ్ళ కథను పాడు చేయడమెందుకని ఇవ్వలేదు.

డైరెక్టర్‌తో వర్కింగ్ ఎలా ఉంది? ఎక్సపీరియెన్సుడా?

తాను తీసే జోనర్‌లో తనకి చాలా అనుభవముంది.

సినిమా లో మీరేమైనా చేంజెస్ చేసారా?

సినిమాకి నేనే సంభాషణలు రాసా. డైరెక్టర్ తమిళ్ వెర్షన్ రాసాడు. వాటికి నేను తెలుగు లోకి రాసా. కొన్ని కొన్ని మ్యాపులు చేశా ప్లేస్, స్లాంగ్ లాంటివి. ఫలానా టైపు క్యారెక్టర్ కావాలి అని.. ఇవన్నీ ప్రీ ప్రొడక్షన్ కిందకి వస్తాయి కానీ సెట్స్ కి వెళ్ళాక ఏమి చేయలేదు. తాను చాలా క్రియేటివ్ గా థింక్ చేస్తాడు. తన ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి ఎలా తీసుకురావాలన్నది తనకి బాగా తెలుసు. చేయాలనుకున్న వర్క్ లో చాలా క్లియర్ గా ఉంటాడు.

విజయ్ ఫస్ట్ నుంచి మీకు తెలుసు. అప్పటికి ఇప్పటికి ఒకేలా ఉన్నాడా?

అప్పటికి ఇప్పటికి అంతే ఉన్నాడు. అప్పుడు మాములుగా కష్టపడ్డాడు, ఇప్పుడు ఏసీ రూమ్‌లో ఉంది కష్ట పడుతున్నాడు. అంతే తప్పించి మిగిలినదంతా ఒకటే.

మీ రెండు సినిమాలకి వివేక్ సాగర్ మ్యూజిక్ ఇచ్చాడు. మరి ఈ సినిమా కి వేరే అతన్ని ఎందుకు తీసుకున్నారు?

అవును. శివ అని షమ్మీర్ కి ఫ్రెండ్. మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇది పూర్తిగా డైరెక్టర్ నిర్ణయమే. ముందు చెప్పినట్లు నా డెసిషన్ అయితే కాదు.

హీరో గా చేయటం ఎలా అనిపించింది?

బేసిక్ గా నేను చాలా ఇంట్రావర్ట్ ని. ఎవరితో పెద్దగా మాట్లాడటానికి ముందుకు రాను. ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి. ఇది నాకు కెరీర్‌లో పెద్ద గ్రోత్.

మీ ఇంట్లో వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు?

చుట్టాలు ఏమంటారో అని ముందు నేనే వద్దనుకున్నా. ఫిదా సినిమా లో మా అమ్మ కి రోల్ వచ్చినప్పుడు నేనొక్కటే చెప్పా నీకు అనిపించింది చేయమ్మా ఎవరేమనుకున్నా నీ ఇష్టం నీకు ముఖ్యం. నువ్వు ఎన్ని రోజులుంటావో ఎవరికీ తెలీదు ఇప్పుడు కూడా కాంప్రమైజ్ రావాల్సిన అవసరం లేదు అని. ఇప్ప్పుడు ఈ సినిమా విషయం లో మా అమ్మ నాకు అదే ధైర్యం ఇచ్చి నీకు నచ్చింది చెయ్ అని చాలా సపోర్ట్ చేసింది. మొన్న ప్రివ్యూ చూసేటప్పుడు కూడా చాలా భయపడుతూ చూసింది చూసాక చాలా నచ్చింది. అమ్మ హ్యాపీ ఈ విషయంలో .

మీ వైఫ్ ఎలా ఫీల్ అయ్యారు?

కొన్ని రోజులు మాట్లాడలేదు. మహానటి, ఫలకనామ దాస్ సినిమాలకి అయితే తాను చాలా సపోర్ట్ చేసింది. కానీ ఈ రోల్ అంటే కొంచెం ఫాలోయింగ్ ఉంటది అనుకుని కొంచెం భయపడింది. తర్వాత అర్ధం చేసుకుంది ఈ సినిమాకి నా కాస్ట్యూమ్స్ కూడా తనే చూసుకుంది. తర్వాత ఏమైనా సినిమాలు చేసినా కూడా తాను నన్ను సపోర్ట్ చేస్తుంది. షి ఈజ్ హ్యాపీ.

ట్రైలర్ లో చూసినట్లు రియల్ లైఫ్ లో కూడా అబద్దాలు చెప్పారా?

అది ఎప్ప్పుడు ఉండేదేగా. నేనే కాదు ప్రతి ఒక్కరూ చెప్తారు.

పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది రెండు సినిమాలు ఒక గ్రాఫ్ ని సెట్ చేసాయి. కానీ పెళ్లి చూపులు సినిమాలా ఈ నగరానికి ఏమైంది హిట్ అవలేదు అంటారు మీరెలా చూస్తారు దీన్ని?

నా పరంగా రెండు మంచి సక్సెస్ లే. పెళ్లి చూపులు 60 లక్షలుతో తీస్తే 40 కోట్లు వచ్చాయి. ఈ నగరానికి ఏమైంది 2 కోట్లుతో తీస్తే 15 కోట్లు వచ్చాయి.. అల్టిమేట్ గా మనం పెట్టిన డబ్బులు వస్తే సినిమా హిట్ అయినట్లే. కానీ తెలియకుండా రెండిటికి కలిపి ఒక లైన్ సెట్ చేసారు.

సురేష్ ప్రొడక్షన్స్ లో స్ట్రక్ అయ్యారనిపిస్తుందా?

వాళ్ళే నాతో స్ట్రక్ అయ్యారనిపిస్తుంది. ఇవాళ కూడా సురేష్ బాబు గారు ఫోన్ చేసారు. ఏంటి సార్ కోపం గా ఉన్నారా అంటే లేదయ్యా నువ్వు నాకు స్టోరీ ఇవ్వు అది చాలు అన్నారు. నేనైతే కంప్రమైజ్ అయ్యి రాయలేను టైం తీసుకుని రీసెర్చ్ చేసి స్టోరీ రెడీ చేసుకోవాలి. అందుకే కొంచెం టైం పడుతుంది.

ఈ సినిమా తర్వాత హీరోగా కంటిన్యూ చేస్తారా?

లేదండి. నిజం చెప్పాలంటే నాకు డైరెక్షన్ వల్లే ఎక్కువ డబ్బులొస్తాయి. దానికి తోడు ఇంకా చాలా కథలున్నాయి వాటిని పాతబడే లోపు రెడీ చేసుకుని సినిమాలు చేయాలి. వరుసగా మూడు ప్లాప్ లు వస్తే అప్పుడు మల్లి యాక్టింగ్ సైడ్ చూస్తా తప్పించి ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచనలేమి లేవు.

విజయ్ తో మళ్ళీ సినిమా ఉండే అవకాశాలున్నాయా ?

ఉన్నాయి. చాలా కథలున్నాయి కానీ ఇప్పుడు విజయ్ ఇమేజ్ ని చూసుకుని దానికి తగ్గట్లు కథ రెడీ చేసుకుని చూడాలి. ఎలాగూ విజయ్ దగ్గర ఇప్పుడు డేట్స్ కూడా లేవు కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండ మళ్ళీ మేమిద్దరం సినిమా చేస్తాం.

వెంకీ తో మూవీ గురించి?

అవుతుంది. స్పోర్ట్స్ డ్రామా అనుకుంటున్నా కానీ ఇంకా రీసెర్చ్ చేయాలి టైం పడుతుంది కొంచెం.

మీరు చిన్న సినిమాలు చేస్తారు. వెంకీ తో కూడా అలానే చేస్తారా? లేదంటే వెంకీ దారిలోకి మీరు వెళ్తారా?

కథకి ఏం అవసరమైతే అది నేను కావాలనుకుంటాను. అంతే కానీ ఒకరి కోసం నా కథని కిల్ చేయను. చేయలేను.

వెబ్ సిరీస్ ప్రెజర్ ఫిలిం మేకర్స్ మీద ఉంటుందా? అవి చాలా అడ్వాన్స్డ్ గా ఉంటున్నాయి కదా కాన్సెప్ట్స్?

ప్రెజర్ ఏం ఉండదు ఎందుకంటే రెండిటికి చాలా తేడా ఉంది. నేను కూడా ఇప్పుడు వెబ్ సిరీస్ చేస్తున్నా కదా. రెండు ఫార్మట్స్ వేరు.

ట్రెడిషనల్ స్టోర్స్‌తో ప్రొడ్యూసర్స్‌ని కలిస్తే అప్డేట్ అవ్వండి అంటున్నారు. మీరెలా చూస్తారు దీన్ని? అంటే అలాంటి సినిమాలు వర్కౌట్ అవ్వవంటారా?

ఎప్పుడైనా సరే సినిమాని బాక్సాఫీస్ నంబర్స్ తో ప్రచారం చేయడం ఆపేయాలి. అపుడే సినిమా స్థాయి పెరుగుతుంది. ఇక ట్రెడిషనల్ స్టోరీస్ వర్క్ అవ్వవు అంటే ఖచ్చితంగా అవుతాయి రీసెంట్ గా వచ్చిన బ్రోచేవారెవరురా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయలే దానికి ఉదాహరణ.

Next Story
Share it