బామ్మ ఇడ్లీ వ్యాపారానికి ఆనంద్ మహీంద్రా చేయూత!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Sept 2019 1:45 PM IST
బామ్మ ఇడ్లీ వ్యాపారానికి ఆనంద్ మహీంద్రా చేయూత!

ఆమె వయసు 80 ఏళ్లు. ఈ మలి వయసు లో కుడా ఎంతో ఉత్సాహంతో పొద్దున్నే లేచి పిండి రుబ్బి..ఇడ్లీ,సాంబార్, చట్నీ తయారుచేసే అమ్ముతారు ఆమె. ఆమె పేరు కమలత్తాల్ . తమిళనాడులోని వడివేలంపాల్యంలో నివసిస్తున్నారు.

కమలత్తాల్ 30 ఏళ్ల నుంచి ఇడ్లీ వ్యాపారం చేస్తున్నారు. దానిని వ్యాపారం అనడం కంటే సేవ అనడం కరక్ట్ ఏమో. ఎందుకంటే ఒక ఇడ్లీని రూ. 1 కే అమ్ముతారు ఆవిడ. 35ఏళ్లుగా కమలత్తాళ్ ఈ వ్యాపారంలో ఉన్నారట. ఒకప్పుడు ఆమె అర్థరూపాయికే ఇడ్లీ అమ్మేవారు. కానీ ఆ తర్వాత ధరలు పెరగడంతో.. రూ.1 కి ఇడ్లీని అమ్ముతున్నారు. లాభం తనకు ముఖ్యం కాదని.. అందరి ఆకలి తీర్చాలన్నదే తన అభిమతమని ఆమె మీడియాకి తెలిపారు.

Kamlla Paati5 1 5051125 835x547 M

స్థానిక కూలీలు, బిచ్చగాళ్లు, ఆటో డ్రైవర్లు, చెత్త ఊడ్చే కార్మికులు వీరే కమలత్తాళ్ రెగ్యులర్ కస్టమర్లు. వీరితో పాటు అనేకమంది సామాన్య జనం, మధ్యతరగతి వ్యక్తులు కూడా ఇక్కడ ఇడ్లీ తినడానికి వస్తుంటారు. దాదాపు రోజుకి 1000 ఇడ్లీల వరకు ఆమె విక్రయిస్తున్నారట. ఇడ్లీల తయారీకి ఆమె ఇప్పటికీ కట్టెలపొయ్యే వాడుతున్నారు.

ఇటీవలే ఆమె గురించి సోషల్ మీడియాలో ప్రసారమైన ఓ కధనం... సాక్షాత్తు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించింది.ఆమెకు సహాయం చేయడానికి ఆయన ముందుకొచ్చారు. “ఆమె నిర్వహిస్తున్న ఈ హోటల్‌కి ఈ రోజు నుండి మేం గ్యాస్ సరఫరాను అందిస్తాం. అలాగే ఆ ప్రాంతంలోని మా సిబ్బంది ద్వారా ఆమెకు పూర్తి సహాయ సహకారాలను అందిస్తాం" అని ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

అలాగే ఆమె వ్యాపారంలో పెట్టుబడి కూడా పెడతానని.. ఆ విధంగా ఆమెకు ధన సహాయాన్ని కూడా చేస్తానని తెలిపారు మహీంద్ర. మహీంద్ర వ్యాఖ్యలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కూడా స్పందించింది. " చక్కగా చెప్పారు సార్. దేశం కోసం ఇండియన్ ఆయిల్ ఏ స్ఫూర్తితో పనిచేస్తుందో.. అలాగే ఆమె కూడా అదేరీతిలో సమాజ సేవ చేస్తున్నారు" అని ఐఓఎల్ యాజమాన్యం జవాబిచ్చింది.

ఆమెకు ఇండేన్ ఎల్పీజీ సిలిండర్‌తో పాటు గ్యాస్ స్టవ్, రెగ్యులేటర్ అందజేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆమెపై.. అలాగే ఆమెకు చేయూతను అందించడానికి ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్ర పై సోషల్ మీడియాలో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

వ్యాపార రంగంలో ఆనంద్ మహీంద్రా ఎందరికో ఆదర్శం, అయితే ఆయనకే కాదు, మనందరికీ ఆదర్శంగా నిలిచిన ఆ తల్లి ధన్యురాలు.

Next Story