ఎన్.ఏ.ఆర్‌తో గంగ ఉధృతి గుర్తింపు.. పాట్నా ను వణికిస్తున్న వరదలు
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 12 Oct 2019 6:31 PM ISTబిహార్: గత నాలుగు రోజులగా కురిసిన వర్షాలతో గంగ ఉగ్రరూపం దాల్చింది. బిహార్ ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే 29 మంది ప్రాణాలు కోల్పోయారు. పాట్నా ఎక్కువగా వరద ప్రభావానికి గురైంది. పాట్నాలోని చాలా ప్రాంతాలు ఇప్పటికే మునిగిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు వరద నీటిపై తేలుతూ కనిపించాయి. ఇది చూస్తే వరద తీవ్రత ఎంతో అర్ధమవుతోంది. ఎన్.ఐఆర్‌తో గంగా నది వరదను కొలిచే ప్రయత్నం చేశాడు ప్రదీప్ గౌడ్. సెప్టెంబర్ 11, సెప్టెంబర్ 29 తేదీలలో పాట్నా వరదలను దృశ్యమానం చేశారు. గంగా నది ఎలా ఉప్పొంగిందో చూపించారు. చిత్రాల్లో చూస్తున్నప్పుడు గంగానది ఇలా ఉప్పొంగిందా అని మనసులో అనుకోకమానరు. పాట్నాలోని లోతట్టు ప్రాంతాలను గంగానది ఎలా ముంచెత్తిందో ఈ చిత్రం చూపిస్తుంది.
1975 వరదలు తరువాత పాట్నాను వరదల నుంచి రక్షించడానికి గోడ నిర్మించారు. గోడకు ఉత్తరం వైపు నుంచి నివాస ప్రాంతాల్లోకి నీరు ప్రవేశించింది.
పాట్నా రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (పిఆర్‌డిఎ) నదీ తీరం వెంబడి నిర్మించిన 8.5 కిలోమీటర్ల పొడవైన గోడకు మించి ఎత్తైన ప్రదేశాల నిర్మాణాలపై ఆంక్షలు విధించింది. నిబంధనలు ఉల్లంఘింస్తూ నది తీరం వెంట అనేక బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు బిల్డర్లు. ఆ నిర్మాణాలపై నిషేధం ఉందని తెలియక అపార్టుమెంట్లు కొనుగోలుచేసి ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లైంది. ప్రజలు ఇటీవల వరదలతో దుఃఖంలో మునిగిపోయారు. వర్షాలకు గంగా నది ఉధృతి అంతకంతకు పెరిగి లోతట్టు ప్రాంతంలోని ఈ ప్రాంతాలు జలమయం అయ్యాయి.
గంగా నది కాకుండా భాగమతి, కోసి, ఘగ్రా, కమలబాలన్, సోన్ వంటి ఇతర నదులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండి) ఆదివారం, సోమవారం రాష్ట్రంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. అంతేకాదు..ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఇప్పటికే కురిసిన వర్షాలతో పాట్నా భయానక పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టకపోడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "దయచేసి బీహార్‌ను కాపాడండి, మీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకును చూసి సిగ్గు పడుతున్నాను అని, స్మార్ట్ సిటీ పాట్నాలో కూడా సరైన డ్రైనేజి వ్యవస్థ లేదని పాట్నాకు చెందిన అమృతా న్షు నిహాల్ అన్నారు.
పాట్నాకు చెందిన మరో స్థానికుడు మేఘనా, “ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఎందుకు నిద్రపోతోంది? పాట్నా ప్రజల చెమటోర్చి కుటుంబాలను పోషించేందుకు కూడబెట్టుకున్న ఆదాయమంతా నీటి పాలవుతుంది" ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొని సహాయక చర్యలు చేపట్టాలంటున్నారు పట్నా వాసులు.