కరోనా పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ కీలక నిర్ణయం
By సుభాష్ Published on 11 Sept 2020 9:59 AM IST![కరోనా పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ కీలక నిర్ణయం కరోనా పరీక్షల విషయంలో ఐసీఎంఆర్ కీలక నిర్ణయం](https://telugu.newsmeter.in/wp-content/uploads/2020/09/ICMR-Guidelines.jpg)
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా పరీక్షల నేపథ్యంలో ఐసీఎంఆర్ కీలక నిర్ణయం తీసుకుంది. అందుకు పలు ఆదేశాలు జారీ చేసింది.
కరోనా లక్షణాలు ఉండి ఆర్టీ-పీసీఆర్ ద్వారా చేసే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో నెగిటివ్ వస్తే మళ్లీ పరీక్ష చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలు ఉంటే ర్యాపిడ్ పరీక్షలు చేస్తారు. వాటిల్లో నెగిటివ్ వస్తే మళ్లీ ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయాలి.
లక్షణాలు లేని వారికి ర్యాపిడ్ టెస్టుల్లో నెగిటివ్ వచ్చినా.. టెస్టు చేసిన రెండు రోజుల తర్వాత మళ్లీ ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయాలి. కానీ ఈ రెండు సందర్భాల్లోనూ అలా జరగడం లేదు. అందుకే దీనిపై ఐసీఎంఆర్ ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే నూతన మార్గదర్శకాల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారి, బృందాలను ప్రతి రాష్ట్రం, జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇలాంటి కేసుల విషయంలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలు పని చేయనున్నాయి. ప్రతి ప్రాంతంలో రోజువారీగా జరిగే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలను బృందాలు విశ్లేషించనున్నాయి.
ఎటువంటి ఆలస్యం లేకుండా లక్షణాలు ఉంటే నెగిటివ్ కేసుల్లో పరీక్షలను చేసే విధంగా పర్యవేక్షణ చేయనున్నారు. అయితే కేసుల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపథ్యంలో పరీక్షల సామర్థ్యం పెంచేందుకు మాత్రమే ర్యాపిడ్ వినియోగిస్తున్నారు. ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకునేందుకు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు కీలకమైనవి.