మ‌హిళ‌ల టీ20 ర్యాంకులు ప్ర‌క‌టించిన ఐసీసీ.. స‌త్తా చాటిన మ‌నోళ్లు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Dec 2019 5:37 AM GMT
మ‌హిళ‌ల టీ20 ర్యాంకులు ప్ర‌క‌టించిన ఐసీసీ.. స‌త్తా చాటిన మ‌నోళ్లు..!

ఐసీసీ తాజాగా టీ20 మహిళల బౌలింగ్‌, బ్యాటింగ్ విభాగాల్లో ర్యాంకులు ప్ర‌క‌టించింది. అయితే.. ఈ ర్యాంకుల్లో భారత లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్‌ రాధా యాదవ్‌ (769 రేటింగ్‌ పాయింట్లు) తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకుంది. మొద‌టిస్థానంలో ఆ్రస్టేలియా బౌలర్‌ మెగాన్‌ స్కట్‌ (773 రేటింగ్‌ పాయింట్లు) ఉంది. మ‌రో భారత బౌలర్ దీప్తి శర్మ ఒక స్థానం కోల్పోయి ఐదో స్థానంలో ఉండ‌గా... పూనమ్‌ యాదవ్‌ ఆరో స్థానం ద‌క్కించుకుంది.

ఇక‌ బ్యాటింగ్ ర్యాంకుల్లోనూ భారత ప్లేయర్లు తమ స‌త్తా చాటారు. జెమీమా రోడ్రిగేజ్ నాలుగో స్థానంలో ఉంది. టీ20 స్పెష‌లిస్ట్ స్మృతి మంధాన ఐదవ స్థానంలో ఉండ‌గా.. హార్డ్ హిట్ట‌ర్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తొమ్మిదో స్థానంలో ఉంది. ఇక టీం విభాగానికొస్తే.. భారత్‌ 260 రేటింగ్‌ పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ్రస్టేలియా 293 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జ‌ట్లు వ‌రుస‌గా రెండూ, మూడు స్థానాల్లో ఉన్నాయి.

Next Story
Share it