ఐసీసీ కొత్త రూల్స్‌.. బంతిపై ఉమ్మి రుద్దితే 5 రన్స్ ఫైన్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  10 Jun 2020 6:01 AM GMT
ఐసీసీ కొత్త రూల్స్‌.. బంతిపై ఉమ్మి రుద్దితే 5 రన్స్ ఫైన్‌

కరోనా మహమ్మారి కారణంగా క్రికెట్‌ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. కరోనా కారణంగా ఇంతకు ముందుగా క్రికెట్‌ ఆడడం కుదరదు. అందుకనే భారత మాజీ అనిల్‌కుంబ్లే నేతృత్వంలోని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రతిపాదించిన తాత్కాలిక నిబంధనలకు ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. బంతిపై ఉమ్మిని రుద్దడాన్నినిషేదించింది. అంతేకాదు కరోనా సబ్‌సిట్యూట్‌కు అనుమతి ఇవ్వడంతో పాటు స్థానిక అంపైర్లకు అవకాశం ఇచ్చింది.

అంతర్జాతీయ క్రికెట్‌ను పునరుద్దరించడానికి ఆయా దేశాల క్రికెట్‌ బోర్డులు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే వెస్టిండిస్‌ జట్టు ఇంగ్లాండ్‌ తో సిరీస్‌ ఆడేందుకు విమానం ఎక్కిన సంగతి తెలిసిందే. ఇక ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు సూచించినట్లుగా కరోనా సబ్‌స్టిట్యూట్‌ కు ఐసీసీ అనుమతి ఇచ్చింది. మ్యాచ్‌ మధ్యలో ఎవరైన ఆటగాడిలో కరోనా లక్షణాలు బయటపడితే.. మరో ఆటగాడికి అవకాశం ఇవ్వడాన్నే కరోనా సబ్‌స్టిట్యూట్‌ అంటారు. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ మాదిరిగానే బౌలర్‌కు బౌలర్‌, బ్యాట్స్‌మెన్‌కు బ్యాట్స్‌మెన్‌ను మ్యాచ్‌ రిఫరీ అనుమతి మేరకు తీసుకోవచ్చు. అయితే.. ఇది కేవలం సుదీర్ఘ పార్మాట్‌కు మాత్రమే (టెస్టులకు) వరిస్తుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వర్తించదు.

రివర్స్‌ స్వింగ్‌ రాబట్టేందుకు, బంతిపై మెరుపు తెచ్చెందుకు బౌలర్లకు బంతిపై ఇప్పటి వరకు ఉమ్మిని ఉపయోగించేవారు. కానీ ఇప్పటి నుంచి అలా చేయకూడదు. ఒకవేళ ఆటగాడు మరిచిపోయి ఉమ్మిని రుద్దితే అంపైర్లు రెండు హచ్చరికలు ఇస్తారు. అప్పటికి కూడా ఆ ఆటగాడు అలాగే చేస్తే ఐదు పరుగుల్ని ప్రత్యర్థి జట్టు ఖాతాలో వేస్తారు. చాలా దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో తటస్థ అంపైర్ల నిబంధనకు ఐసీసీ కొంత కాలం రద్దు చేసింది. స్థానిక అంపైర్లను వినియోగించుకోవచ్చునని తెలిపింది. ఐసీసీ ఎలైట్‌ ప్యానెల్‌, ఎమిరేట్స్‌ ఐసీసీ ఇంటర్నేషనల్‌ మ్యాచ్‌ అఫీషియల్స్‌ నుంచి ఐసీసీ వీరిని నియమిస్తుంది.

ఇప్పుడున్న డిఆర్‌ఎస్‌లకు తోడుగా అదనంగా మరో డిఆర్‌ఎస్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో ఇక పై టెస్టుల్లో మూడు వన్డేల్లో రెండు డీఆర్‌ఎస్‌లు వినియోగించుకోవచ్చు. ఆటగాళ్లు నిబంధనలు అతిక్రమించకుండా పర్యవేక్షించేందుకు తటస్థ ఎలైట్‌ ప్యానెల్‌ రిఫరీ ఆన్లైన్‌ ద్వారా అందుబాటులో ఉంటారు. 12 నెలల పాటు జెర్సీపై మరో లోగోకు అనుమతి ఇస్తున్నామని ఐసీసీ తెలిపింది.

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌ పై నేడు స్పష్టత రానుంది. నేడు జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. షెడ్యూల్‌ ప్రకారం అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. ఒకవేళ ప్రపంచకప్‌ వాయిదా పడితే.. ఐపీఎల్‌ నిర్వహించే ఆలోచనలో బీసీసీఐ ఉంది. దీనిపై కూడా నేడు స్పష్టత రానుంది.

Next Story