ఐబీ అధికారి హత్య కేసు: పోస్టుమార్టం రిపోర్ట్‌ లో సంచలన నిజాలు

By సుభాష్  Published on  28 Feb 2020 7:49 AM GMT
ఐబీ అధికారి హత్య కేసు: పోస్టుమార్టం రిపోర్ట్‌ లో సంచలన నిజాలు

ఢిల్లీలో ఐబీ అధికారి అంకిత్‌ శర్మ పోస్టుమార్టం రిపోర్ట్‌ లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. అంకిత్‌ శర్మను దారుణంగా హతమార్చినట్లు పోస్టుమార్టం రిపోర్ట్‌ లో తేలింది. అంతేకాదు దుండగులు అతని శరీరంపై అంగుళం కూడా ఖాళీ లేకుండా కత్తిపోట్లు పొడిచినట్లు తేలింది. ఆయన శరీరంపై 400 కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రతి భాగాన్ని ఛిద్రం చేసినట్లు పోస్ట్‌ మార్టం నివేదికలో తేలింది. కాగా, 4 నుంచి 6 గంటల పాటు సాగిన ఈ హత్యాకాండలో తీవ్రంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే అంకిత్‌ వర్మను ఆరుగురు వ్యక్తులు కలిసి హత్య చేసి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. ఆయనపై పదునైన ఆయుధాలతో చంపేశారని ఫోరెన్సిక్స్‌ నిపుణులు పేర్కొన్నారు.

ఓ వ్యక్తిని ఇంత కిరాతకంగా చంపడం, శరీరం మొత్తం ఖాళీ లేకుండా తూట్లు.. తూట్లుగా పొడిచి చంపడాన్ని జీవితంలో ఎన్నడూ చూడలేదని ఫోరెన్సిక్‌ వైద్యులు చెబుతున్నారు.

కాగా, ఫిబ్రవరి 26వ తేదీన ఖజారి చాంద్‌బాగ్‌ నాలాలో మూడు మృత దేహాలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహాలను పరిశీలించగా, అదృశ్యమైన ఇంటలిజెన్స్‌ బ్యూరో సెక్యూరిటీ అసిస్టెంట్‌గా పని చేస్తున్న యువకుడు అంకిత్‌ శర్మగా గుర్తించారు. శర్మను కత్తులతో దాడి చేసి ఈడ్చుకెళ్లి నాలాలో పడేశారు. కళ్లు పీకేసీ, గొంతును కోసి దారుణంగా హతమార్చారు.

Next Story
Share it