వారి స్టైలే వేరు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 11:39 AM GMT
వారి స్టైలే వేరు..!

హైదరాబాద్: హెరిటేజ్ వాక్ పేరుతో హైదరాబాద్ నగరంలో ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అధికారులు. ఈ తరహా కార్యక్రమం చేపట్టడం నగరంలోనే ఇదే మొదటిసారి. సీపీ అంజన్ కుమార్, ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్, ముషారఫ్ లతో పాటు మరికొంత మంది అధికారులు కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటువంటి హెరిటేజ్ వాక్ ఐరోపాలోని కొన్ని చారిత్రక నగరాల్లో ప్రసిద్ది చెందింది. ఇప్పుడు దీనిని నగరానికి పరిచయం చేశారు అధికారులు.

ఉదయం 6 గంటలకు గోషామహల్ వద్ద మౌంటెడ్ యూనిట్ నుంచి 20 గుర్రాలతో ఈ ట్రోట్ ప్రారంభించారు. నగరంలోని అన్ని పురాతన కట్టడాలతో పాటు, చారిత్రక ప్రదేశాలను చుట్టివచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా వున్న స్థితిగతులను తెలుసుకున్నారు. అంతేకాదు.. చారిత్రక నగరాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యతను గూర్చి వివరిస్తూ హెరిటేజ్ వాక్ ఆధ్యంతం ఉల్లాసంగా సాగింది. ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఇంతమంది అధికారులు తమ ప్రాంతాల్లో పర్యటించడం సంతోషంగా ఉందన్నారు.

Next Story
Share it