పెళ్లి చేసుకున్న 'జబర్దస్త్' క‌మెడియ‌న్ మ‌హేష్‌‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 May 2020 12:15 PM GMT
పెళ్లి చేసుకున్న జబర్దస్త్ క‌మెడియ‌న్ మ‌హేష్‌‌

క‌రోనా వ్యాప్తిని నియంత్రించ‌డానికి దేశ వ్యాప్త లాక్‌డౌన్ ను విధించ‌డంతో చాలా మంది త‌మ పెళ్లిళ్ల‌ను వాయిదా వేసుకున్నారు. ఇక మే 17 త‌రువాత కూడా లాక్‌డౌన్ కొనసాగుతుంద‌ని ప్ర‌ధాని చెప్పిన సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ పొడిగింపు, త్వ‌రలో మూఢం వ‌స్తుండ‌డం, ఇప్ప‌ట్లో ముహూర్తాలు లేక‌పోవ‌డం వంటి కార‌ణాల‌తో ఇంకా ఆల‌స్యం చేయ‌కూడ‌ద‌ని పెళ్లి వాయిదా వేసుకున్న వాళ్లంతా పెళ్లి పీఠ‌లు ఎక్కేస్తున్నారు.

మొన్న ప్ర‌ముఖ నిర్మాత దిల్‌రాజ్ రెండో పెళ్లి చేసుకోగా నేడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ త‌న ప్రేయ‌సి ప‌ల్ల‌వితో పెళ్లిపీట‌లు ఎక్కేసాడు. కాగా.. 'జ‌బ‌ర్ధ‌స్త్' క‌మెడియ‌న్‌, 'రంగ‌స్థ‌లం' ఫేమ్ మ‌హేష్ కూడా ఓ ఇంటివాడు అయ్యాడు. తూర్పుగోదావ‌రి జిల్లా రాజోలుకు చెందిన మ‌హేష్‌.. శివ‌కోడు గ్రామానికి చెందిన‌ పావ‌నిని గురువారం వివాహాం చేసుకున్నాడు. లాక్‌డౌన్ కావ‌డంతో అతి కొద్ది మంది స‌మ‌క్షంలో మ‌హేష్ పెళ్లి జ‌రిగింది. మ‌హేష్ పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. 'రంగస్థలం' చిత్రంలో చిట్టిబాబు(రామ్ చ‌రణ్)కు‌ అసిస్టెంట్‌గా న‌టించాడు. అలానే 'మ‌హాన‌టి' చిత్రంలోనూ న‌టించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

Iabardasth comedian mahesh got married

Next Story
Share it