'విజిల్` చిత్రాన్ని మ‌హిళ‌ల‌కు అంకిత‌మిస్తున్నాను -డైరెక్ట‌ర్ అట్లీ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  24 Oct 2019 9:13 AM GMT
విజిల్` చిత్రాన్ని మ‌హిళ‌ల‌కు అంకిత‌మిస్తున్నాను -డైరెక్ట‌ర్ అట్లీ

త‌మిళ స్టార్ హీరో విజ‌య్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న చిత్రం 'విజిల్‌“. విజ‌య్ హీరోగా అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఎమోష‌న‌ల్ స్పోర్ట్స్ డ్రామా 'బిగిల్‌'. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్పాతి ఎస్‌.అఘోరాం, కల్పాతి ఎస్‌.గ‌ణేశ్‌, క‌ల్పాతి ఎస్‌.సురేశ్ నిర్మించిన ఈ చిత్రాన్ని 'విజిల్‌'గా ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కోనేరు తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. దీపావ‌ళి సంద‌ర్బంగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రం అక్టోబ‌ర్ 25న విడుద‌ల కానుంది.

ఈ మూవీ నాకు చాలా స్పెషల్‌: వర్ష

నేను ఇందులో ఓ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా క‌నిపిస్తాను. ఈ పాత్ర చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాను. విజ‌య్‌గారితో క‌లిసి న‌టించ‌డం చాలా ల‌క్కీగా భావిస్తున్నాను. మంచి అవ‌కాశాన్ని ఇచ్చిన డైరెక్ట‌ర్ అట్లీ గారికి థ్యాంక్స్‌“ అన్నారు.

ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ అధినేత మ‌హేష్ కొనేరు-“త‌మిళంలో ఇప్పుడు 'బిగిల్‌' కు ఎంత క్రేజ్ ఉందో తెలుగులో 'విజిల్‌' కు అంతే క్రేజ్ ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌స్తుంది. ఇదేదో త‌మిళ సినిమా అనో.. ద‌క్షిణాది సినిమా అని చెప్ప‌డం కంటే ఇండియ‌న్ సినిమా అని చెప్ప‌డానికి సంతోష‌ప‌డుతున్నాను. ఇందులో కంటెంటే కింగ్‌.

డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ మాట్లాడుతూ -“నేను అట్లీగారి సినిమాల‌కు పెద్ద ఫ్యాన్‌ని. విజిల్ సినిమా ట్రైల‌ర్ చూడ‌గానే గూజ్‌బామ్స్ వ‌చ్చాయి. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌ను తెర‌కెక్కించే అట్లీగారు .. క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో పాటు హై ఎమోష‌న్స్‌ను ఈ సినిమాలో చూపిస్తున్నారు.

డైరెక్ట‌ర్ అట్లీ మాట్లాడుతూ..

నేను తెలుగులో సినిమా చేయాల‌ని చాలా కాలంగా క‌ల కంటున్నాను. త్వ‌ర‌లోనే ఆ క‌ల నేర‌వేర‌నుంది. ఎన్టీఆర్‌గారు చాలా మంచి హృద‌య‌మున్న వ్య‌క్తి. నా ప్ర‌తి సినిమాకు ఆయ‌న ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఈ కార‌ణంగానే నేను తెలుగులో సినిమా చేయాల‌నుకుంటున్నాను. ఇక విజిల్ విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాను తెలుగులో 700 థియేటర్స్‌లో విడుద‌ల చేస్తుండ‌టం గొప్ప‌గా అనిపిస్తుంది. త‌ర్వాత నా బ్ర‌ద‌ర్ విజ‌య్ అన్న‌కు థ్యాంక్స్‌. ఆయ‌న లేకుండా నేను లేను. ఆయ‌న వ‌ల్లే నేనీ స్థాయిలో ఉన్నాను. ప్ర‌స్తుత స‌మాజంలో మ‌హిళ‌ల పై ఎన్నో అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. ఆ విష‌యాలు న‌న్నెంతో బాధించాయి. ఆ కార‌ణాల‌తో నేను విజిల్ క‌థ‌ను రాశాను.

ఈ సినిమా తమిళం కంటే తెలుగులోనే పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్ముతున్నాను. ఈ సినిమాలో ఎమోష‌న్స్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతాయి. ప్ర‌తి మ‌హిళ, పురుషుడు ఈ సినిమాను చూడాలి. విజ‌య్‌లాంటి సూప‌ర్‌స్టార్‌తో ఓ క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసేయ‌వ‌చ్చు. ఈ సినిమాను మ‌హిళ‌ల కోస‌మే చేశాను. ఫుట్‌బాల్‌కు మ‌న దేశంలో పెద్ద ఆద‌ర‌ణ లేక‌పోయినా..ఈ సినిమా చూస్తే ఓ పాజిటివిటీని ప్రేక్ష‌కులు త‌మ‌తో తీసుకెళ‌తార‌ని చెప్ప‌గ‌ల‌ను. ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారికి థ్యాంక్స్‌. న‌య‌న‌తారకి థ్యాంక్స్‌. అలాగే 12 మంది లేడీస్ ఫుట్‌బాల్ ఆట‌ను ఆడారు. ప్ర‌తి ఒక క్యారెక్ట‌ర్ అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంది. మ‌హేష్‌గారికి థ్యాంక్స్‌“ అన్నారు.

Next Story
Share it