ట్రాఫిక్ పోలీసుల‌కు షాకిచ్చిన ఆక‌తాయిలు

Young men escaping with breath analyse in kondapur.డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న ట్రాఫిక్ పోలీసుల‌కు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 Sept 2021 3:14 PM IST
ట్రాఫిక్ పోలీసుల‌కు షాకిచ్చిన ఆక‌తాయిలు

డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్న ట్రాఫిక్ పోలీసుల‌కు అప్పుడ‌ప్పుడు కొంద‌రు మందుబాబులు చుక్కులు చూపిస్తూ ఉంటారు. మ‌ద్యం మ‌త్తులో ఇష్టానుసారం వ్య‌వ‌హ‌రిస్తూ.. పోలీసుల స‌హ‌నానికి ప‌రీక్ష‌లు పెడుతుంటారు. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తుండ‌గా.. ప‌రీక్ష చేసేందుకు నోటి ద‌గ్గ‌ర పెట్టిన బ్రీత్ ఎన‌లైజ‌ర్ యంత్రాన్ని లాక్కొని ఇద్ద‌రు మందుబాబులు పారిపోయారు. ఈ ఘ‌ట‌న కొండ‌పూర్ ద‌గ్గ‌ర చోటుచేసుకుంది.

శుక్ర‌వారం రాత్రి గచ్చిబౌలి ట్రాఫిక్‌ పోలీసులు కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌ సమీపాన డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. రాత్రి 11.45 సమయంలో మియాపూర్‌ వైపు నుంచి బైక్‌పై వ‌స్తున్న ఇద్ద‌రిని ఆపారు. బైకు నడుపుతున్న వ్యక్తికి శ్వాస పరీక్షలు నిర్వహించేందుకు హోంగార్డు తన చేతిలో ఉన్న బ్రీత్‌ ఎనలైజర్‌ను యువకుడి నోటి ద‌గ్గ‌ర‌గా పెట్టాడు. ఆ యువ‌కుడు హోంగార్డు చేతిలో ఉన్న యంత్రాన్ని లాక్కొని వేగంగా బైక్‌పై వెళ్లిపోయాడు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు వారిని ప‌ట్టుకునేందుకు య‌త్నించినా.. ఫ‌లితం లేకుండా పోయింది. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ఆక‌తాయిల‌ను పట్టుకునే ప‌నిలో ఉన్నారు.

Next Story