Hyderabad: పెళ్లికి ముందు ఉరేసుకుని అమ్మాయి ఆత్మహత్య
మరో పన్నెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉండగా యువతి ఆత్మహత్య చేసుకుంది.
By Srikanth Gundamalla Published on 6 March 2024 2:15 PM ISTHyderabad: పెళ్లికి ముందు ఉరేసుకుని అమ్మాయి ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. మరో పన్నెండు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. పెళ్లి పనులు కూడా హడావుడిగా సాగిపోతున్నాయి. ఇక పెళ్లికొడుకు తరుఫువాళ్లతో పాటు.. తమ కుటుంబ సభ్యులు కూడా పెళ్లి పనుల్లో మునిగిపోయారు. ఈ సమయంలోనే పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి తన జీవితానికి ముగింపు పలికింది. ఉరివేసుసుకుని ఆత్మహత్య చేసుకుంది. అమ్మాయి చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
దివ్య శ్రీ అనే అమ్మాయి కొత్తగూడలోని హాస్టల్‌లో ఉంటూ.. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవలే యువతికి ఆమె తల్లిదండ్రులు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. మాటామాటా కలుపుకొని.. సంబంధాన్ని ఖాయం కూడా చేసుకున్నారు. ఆ తర్వాత మార్చి 17వ తేదీన వివాహం జరిపించాలని ముహూర్తం కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. దివ్య శ్రీ కూడా తన కాబోయే భర్తతో కలిసి వెడ్డింగ్ షూట్ కోసం ప్లాన్ చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు కానీ ఉన్నట్లుండి అమ్మాయి ఆత్మహత్ చేసుకుంది.
ప్రీవెడ్డింగ్ షూట్ కోసం బయటకు వెళ్లాల్సి ఉండగా.. ముందురోజే ఆమె ఉంటున్న హాస్టల్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాత్రూంలో షవర్ రాడ్డుకు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. ఇక అమ్మాయి చనిపోయిన విషయాన్ని తెలుసుకున్న హాస్టల్ వార్డెన్ వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులకు కూడా చెప్పడంతో వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేవలం 12 రోజుల్లో పెళ్లి అనగా కూతురు చనిపోవడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.