Wings India: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌బస్
ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌బస్ బోయింగ్ జెట్ 777-9 బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా వైమానిక ప్రదర్శనలో ప్రదర్శించబడింది.
By అంజి Published on 18 Jan 2024 2:16 PM ISTWings India: బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌బస్
హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత సమర్థవంతమైన ట్విన్ ఇంజన్ జెట్‌లలో ఒకటైన బోయింగ్ జెట్ 777-9 బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న వింగ్స్ ఇండియా వైమానిక ప్రదర్శనలో ప్రదర్శించబడింది. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా-2024’ వైమానిక ప్రదర్శనను కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. వింగ్స్ ఇండియా-2024 ఈవెంట్ నేటి నుండి నాలుగు రోజుల పాటు జరుగుతుంది. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈనెల 18 నుంచి 21 వరకు విన్యాసాలు నిర్వహించనుంది.
బోయింగ్ 777-9, ఫ్లైట్ టెస్ట్ ఏరోప్లేన్.. జనవరి 16 మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుంది. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సేవలను అప్‌గ్రేడ్ చేయడానికి 2023లో 777-9 ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 10 విమానాలను ఆర్డర్ చేసింది. వింగ్స్ ఇండియా ఎయిర్ షో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (FICCI) చేత నిర్వహించబడుతున్న నాలుగు రోజుల ఈవెంట్‌లో టాటా గ్రూప్ యొక్క ఎయిర్ ఇండియా యొక్క ఎయిర్‌బస్ A350 కూడా ప్రదర్శించబడింది.
వింగ్స్ ఇండియా 2024 ఏవియేషన్ పరిశ్రమలోని వివిధ అంశాలను చర్చించడానికి హైదరాబాద్‌లోని ఒక ఉమ్మడి వేదికపై కొనుగోలుదారులు, విక్రేతలు, పెట్టుబడిదారులు, ఇతర వాటాదారులను ఒకచోట చేర్చింది. మొదటి రెండు రోజులు వ్యాపార చర్చల కోసం, మిగిలిన రెండు రోజులు సాధారణ ప్రజల కోసం తెరవబడతాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి 106 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు, ప్రపంచవ్యాప్తంగా 200 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. 5,000 మంది వ్యాపార సందర్శకులు, లక్ష మంది సందర్శకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. సుమారు 500 B2G/B2B సమావేశాలు ప్లాన్ చేయబడ్డాయి.