అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేస్తే 22 లక్షలు ఇస్తారట
Will give Rs 22 lakh to police officer if Owaisi arrested.ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన
By M.S.R Published on 2 Jan 2022 9:00 AM GMTఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని అరెస్టు చేసిన వారికి రూ.22 లక్షలు ఇస్తామని హిందూ సంఘాల ప్రతినిధులు ప్రకటించారు. హిందూ ధర్మకర్త కాళీచరణ్ మహరాజ్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పలు సంస్థల సభ్యులు తెలిపాయి. ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని అరెస్ట్ చేసిన పోలీసు అధికారికి రూ. 22 లక్షల నగదు బహుమతిని కూడా వారు ప్రకటించారు.
నమాజ్‌ను వ్యతిరేకిస్తూ, నాథూరాం గాడ్సేను పొగుడుతూ ఆయా సంఘాల నేతలు గురుగ్రామ్‌లో శనివారం నిరసనలు వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీని కించపరిచే వ్యాఖ్యల్ని చేసినందుకు గత నెల 30న అరెస్టు చేసిన కాళీచరణ్ మహారాజ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 22 సంఘాలకు చెందిన ఆందోళనకారులు ఈ నిరసనల్లో పాల్గొన్నారు. గురుగ్రామ్‌లోని సివిల్ లైన్స్ వద్ద డిప్యూటీ కమిషనర్ ఇంటి నుంచి కార్యాలయం వరకూ పాదయాత్ర సాగింది.
"ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కు ఉంది. సంత్ కాళీచరణ్ అరెస్టు వెనుక కుట్ర ఉంది. ఒవైసీని పోలీసులు, ప్రభుత్వం ఎందుకు అరెస్టు చేయలేదు? ఒవైసీని పట్టుకున్న పోలీసు అధికారికి రూ. 22 లక్షలు ఇస్తాం'' అని నిరసన ప్రదర్శనకు నేతృత్వం వహించిన హిందూ నాయకుడు, న్యాయవాది కులభూషణ్ భరద్వాజ్ అన్నారు. ఈ రెండు డిమాండ్లతో తహశీల్దార్ సుశీల్ కుమార్‌కు వినతి పత్రం కూడా సమర్పించారు. ఇటీవల, ఒవైసీ ప్రసంగానికి సంబంధించిన తేదీ లేని వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. హైదరాబాద్ ఎంపీ ప్రసంగం సందర్భంగా హిందువులను బెదిరింపులకు గురిచేశారని పలు హిందూ సంఘాల కార్యకర్తలు ఆరోపించారు.