Hyderabad: విద్యార్థినిల బాత్రూంల్లో కెమెరాలు.. 300 వీడియోలు రికార్డ్ చేసినట్టు అనుమానం!
సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.
By అంజి Published on 2 Jan 2025 7:10 AM ISTHyderabad: విద్యార్థినిల బాత్రూంల్లో కెమెరాలు.. 300 వీడియోలు రికార్డ్ చేసినట్టు అనుమానం!
హైదరాబాద్: సీఎంఆర్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్‌లో విద్యార్థినుల వీడియోల చిత్రీకరణ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు హాస్టల్ సిబ్బందికి చెందిన 12 ఫోన్లను స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు సుమారు 300 వీడియోలు రికార్డ్ చేసినట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో లీక్ అయితే ఎమ్మెల్యే మల్లారెడ్డే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు. బాలికల హాస్టల్ బాత్‌రూమ్‌లో అనుచితంగా వీడియో రికార్డింగ్ చేశారన్న ఆరోపణలతో మేడ్చ్‌లోని సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్‌లో నిన్న ఉద్రిక్తత నెలకొంది.
గర్ల్స్ హాస్టల్‌లోని బాత్రూంలో మొబైల్‌తో వీడియోలు తీశారని ఆరోపిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ విషయం తెలిసి విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. విద్యార్థులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, తక్షణమే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. హాస్టల్‌లోని బాత్‌రూమ్‌లో రహస్యంగా వీడియోలు రికార్డింగ్ చేస్తున్నారని కొందరు విద్యార్థులు అనుమానించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
హాస్టల్ వంటగదిలో పనిచేసే వ్యక్తులే నిందితులు అయి ఉంటారని విద్యార్థులు ఆరోపించారు. దిగ్భ్రాంతికరమైన వెల్లడి విద్యార్థులను ఆగ్రహానికి గురిచేసింది, న్యాయం కోసం ఒత్తిడి చేయడానికి కళాశాల వెలుపల గుమిగూడింది.సమాచారం అందుకున్న మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఈ ఘటనపై కాలేజీ యాజమాన్యం ఇంకా ప్రకటన విడుదల చేయలేదు. ఇదిలా ఉండగా, భవిష్యత్తులో ఇలాంటి గోప్యతకు భంగం కలగకుండా ఉండేందుకు హాస్టల్‌లో భద్రతను పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు.