నుమాయిష్‌లో యూఎస్‌ కాన్సులెట్‌ జనరల్‌ జెన్నిఫర్ సందడి

US Consulate General Jennifer Larson visits Numaish. హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులెట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ నాంపల్లి

By అంజి  Published on  16 Feb 2023 1:00 PM IST
నుమాయిష్‌లో యూఎస్‌ కాన్సులెట్‌ జనరల్‌ జెన్నిఫర్ సందడి

హైదరాబాద్‌లోని యూఎస్‌ కాన్సులెట్‌ జనరల్‌ జెన్నిఫర్‌ లార్సన్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోని నుమాయిష్‌ను సందర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె తన ట్వీటర్‌ అకౌంట్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. నుమాయిష్‌లోని స్టాల్స్‌లో కలియతిరిగి సందడి చేశారు. వివిధ వస్తువుల ధరలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఉన్న స్టాళ్లలో జెన్నిఫర్‌ తనకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. అక్కడి నుంచి డ్రైఫ్రూట్‌ స్టాల్‌కు వెళ్లి.. నుమాయిష్‌ను ఆస్వాదిస్తూ డ్రైఫ్రూట్స్‌ టేస్ట్‌ చేశారు. అనంతరం మసాలా స్వీట్‌ కార్న్ తిని ఎంజాయ్‌ చేశారు. నుమాయిష్‌ చాలా అద్భుతంగా ఉందంటూ తాను ఎక్సీపిరియన్స్‌ చేసిన వీడియోను జెన్నిఫర్‌ షేర్ చేశారు.

''నేను నుమాయిష్ గురించి చాలా విన్నాను. అందుకే దాన్ని చూడడానికి వెళ్లాను. ఇది చాలా సరదాగా ఉంది. నేను యూఎస్‌లో తిరిగి హాజరైన స్టేట్‌ ఫెయిర్స్‌ గురించి నాకు గుర్తు చేసింది. నేను మొదటిసారి మిర్చి భజ్జీని ప్రయత్నించాను. యమ్మీగా ఉంది'' అంటూ జెన్నిఫర్‌ లార్సన్‌ తన వీడియోకు క్యాప్షన్‌ రాసుకొచ్చారు. ఇటీవల సంక్రాంతి పండుగను కూడా జెన్నిఫర్‌ ఎంతగానో ఎంజాయ్‌ చేశారు. తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్‌పర్సన్‌ దీపికా రెడ్డి నివాసానికి వెళ్లిన జెన్నిఫర్.. రంగువల్లులను చూసి ఎంతో మురిసిపోయారు. అరిసెలు, సకినాలు, పొంగల్‌ రూచి చూసి ఆనందం వ్యక్తం చేశారు. అలాగే సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటారో తెలియజేస్తూ.. దీపికా రెడ్డి శిష్యబృందం చేసిన నృత్యాన్ని ఆమె తిలకించారు.

Next Story