Hyderabad: వేధిస్తున్నాడని పోలీసులకు భార్య ఫిర్యాదు.. ఇంటికి తాళం వేసి భర్త పరారు

ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే భార్య పిల్లలను ఇంట్లోనికి రానివ్వకుండా ఇంటికి, గేట్‌కు తాళాలు వేసి భర్త పరారుయ్యడు.

By అంజి
Published on : 8 April 2025 9:49 AM IST

husband harassment, wife filed complaint, Adibhatla police station

Hyderabad: వేధిస్తున్నాడని పోలీసులకు భార్య ఫిర్యాదు.. ఇంటికి తాళం వేసి భర్త పరారు 

ఓ మహిళ భర్త వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే భార్య పిల్లలను ఇంట్లోనికి రానివ్వకుండా ఇంటికి, గేట్‌కు తాళాలు వేసి భర్త పరారుయ్యడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్నెగూడ గ్రామానికి చెందిన మర్రి నరేందర్ రెడ్డి ప్రియాంక దంపతులు.. వారి తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ప్రియాంకను ఆమె భర్త నరేందర్ రెడ్డి, అత్త మామలు వేధిస్తున్నారు.

నరేందర్ రెడ్డి ఆమె భార్యను కాదని మరొక స్త్రీతో వివాహేతర సంబంధం పెట్టుకొని, ప్రియాంకను దూరంగా ఉంచుతూ ఆమెను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తూ వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో భర్తపై భార్య ప్రియాంక ఫిర్యాదు చేసింది. దీంతో నరేందర్ రెడ్డి తన భార్య పిల్లలను ఇంటికి రానివ్వకుండా ఇంటికి, గేట్ కు తాళాలు వేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రియాంక ఆమె పిల్లలు, బంధువులు కలిసి సోమవారం మన్నెగూడలోని ఇంటి వద్దకు వెళ్లి చూడగా తాళాలు వేసి ఉండడంతో ఆమె గేట్ తాళాలు పగులకొట్టి ఇంట్లోకి వెళ్లారు.

Next Story