వైరల్ వీడియోలు చూసి మురిసిపోవడం కాదు.. టేస్ట్ చూసి థ్రిల్ అవ్వండి
హైదరాబాద్‌లో టర్కిష్ ఐస్ క్రీం కియోస్క్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
By News Meter Telugu Published on 15 July 2023 8:02 AM GMTవైరల్ వీడియోలు చూసి మురిసిపోవడం కాదు.. టేస్ట్ చూసి థ్రిల్ అవ్వండి
టోపీలు పెట్టుకున్న కొందరు ఐస్ క్రీమ్ కోన్ ను ఆశ చూపిస్తూ.. చిన్న పిల్లలను, కష్టమర్లను ఆట పట్టించే వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూసే ఉంటాం. ఇదంతా టర్కిష్ ఐస్ క్రీమ్ స్టాల్స్ చలవే అని అంటారు. ఈ స్టాల్స్ దగ్గర మామూలు సందడి ఉండదు. ఇక టేస్ట్ కూడా అంతే గొప్పగా ఉంటుందని చెబుతూ ఉంటారు. మన హైదరాబాద్ లో కూడా ఈ స్టాల్స్ బాగా ఆదరణ నోచుకుంటున్నాయి.
ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో టర్కిష్ ఐస్ క్రీం కియోస్క్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది.. ముఖ్యంగా యువత టర్కిష్ ఐస్ క్రీమ్ ను తినడానికి ఆసక్తి చూపుతోంది. "నేను మొదట సిటీ ఈవెంట్‌లో టర్కిష్ ఐస్‌క్రీమ్‌ని ప్రయత్నించాను. ఐస్‌క్రీం స్మూత్‌గా, మార్కెట్‌లోని ఇతర ఐస్‌క్రీమ్‌ల కంటే భిన్నంగానూ రుచిగానూ అనిపించింది. మరోవైపు స్టాల్‌లో చేసిన ట్రిక్స్ కూడా నాకు ఆనందాన్ని ఇచ్చింది. నాకు కోన్ ఇచ్చి.. దాని మీద క్రీమ్ ఉంచి.. నన్ను ఆటపట్టించారు. ఐస్ క్రీం తీసుకోవడం కోసం అన్ని ట్రిక్స్ చేయడం చాలా సరదాగా అనిపించింది" అని నగరానికి చెందిన IT ఉద్యోగి రాధిక మాలూ చెప్పారు.
కొంపల్లిలో టర్కిష్ ఐస్ క్రీం దుకాణాన్ని నడుపుతున్న జగ్బీర్ సింగ్ మాట్లాడుతూ, "ట్రిక్స్ చేసే వ్యక్తులను జగ్లర్స్ అని అంటారు.. ప్రజల దృష్టిని ఆకర్షించడం, ఆనందాన్ని ఇవ్వడం కూడా ఓ నైపుణ్యమే" అని చెప్పారు. "వారు సాధారణంగా ఆరు నుండి ఏడు రకాల ట్రిక్స్ చేస్తూ ఉంటారు. కష్టమర్స్ అనుమతితో ట్రిక్ చేస్తారు, వారి భావోద్వేగాల ఆధారంగా ట్రిక్స్ మారుతూ ఉంటాయి. ఐస్ క్రీమ్ సర్వ్ చేసే చాలా మంది కొత్త ట్రిక్స్‌ని నేర్చుకుంటూ ఉంటారు." అని చెప్పారు.
"టర్కిష్ ఐస్ క్రీం విక్రేతలు వారి చిలిపి పనులకు ప్రసిద్ధి చెందారు. ఇందులో కస్టమర్లను ఐస్‌క్రీమ్ ఇస్తూ గందరగోళానికి గురి చేయడం, ఐస్‌క్రీం ఇస్తున్నప్పుడు వారిని నవ్వించడం వంటివి ఉంటాయి. సాంప్రదాయకంగా దీనిని దొందుర్మా అని పిలుస్తారు. ఇది టర్కీలో ఉద్భవించిన ఒక రకమైన ఐస్ క్రీం. ఇది అద్భుతమైన టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది ఇతర ఐస్ క్రీంలా కాకుండా వివిధ రకాల రుచులతో వస్తుంది” అని డై హార్డ్ ఫుడీస్ వ్యవస్థాపకుడు ఫరాజ్ ఫర్షోరి అన్నారు. "మెటల్ రాడ్ అనేది సంప్రదాయ తయారీ ప్రక్రియలో భాగం. ఐస్ క్రీం ను రకరకాలుగా వీలైతే గట్టిగా.. లేదంటే స్మూత్ గా చేయడానికి.. ఈ రాడ్ పనికి వస్తుంది. ఇది నాన్-ఎలాస్టిక్ ఐస్ క్రీం కంటే చాలా నెమ్మదిగా కరుగుతుంది, ఇది టర్కిష్ వేడిలో కూడా బాగా ఉంటుంది" అన్నారాయన.
సోషల్ మీడియాకు యూజర్లకు పండగ:
రంగురంగుల ఐస్ క్రీంని తిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి బాగా సూట్ అవుతుంది. అలాగే స్టాల్ దగ్గర ఆడించే ట్రిక్ కు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా యూజర్లను బాగా ఆకట్టుకుంటూ ఉంటాయి. స్టాల్ ట్రిక్స్ కు సంబంధించిన వీడియోలు వివిధ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. గతంలో విదేశాలలో కనిపించే క్రేజీ స్టంట్స్ ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులోకి కూడా వచ్చేసాయి. ముఖ్యంగా యువతకు, పిల్లలకు ఈ స్టాల్స్ వినోదాన్ని పంచుతున్నాయి.
టర్కిష్ ఐస్‌క్రీమ్ అంటే ఏమిటి?
టర్కిష్ ఐస్ క్రీం.. సాధారణంగా గెలాటో అని పిలుస్తారు. 'గెలాటో' అనే పదానికి ఇటాలియన్ భాషలో 'ఐస్ క్రీం' అని అర్థం. గెలాటో, సాంప్రదాయ ఐస్‌క్రీమ్‌లు రెండూ పాలు, చక్కెర, క్రీమ్‌లను కలిగి ఉన్నప్పటికీ.. గెలాటో సాంప్రదాయ ఐస్‌క్రీం కంటే మెత్తగా, సువాసనగా ఉంటుంది. గుడ్లు సాధారణంగా ఐస్ క్రీంలో కూడా ఉపయోగిస్తారు. కానీ టర్కిష్ ఐస్ క్రీం విషయంలో కాదు.
టర్కిష్ ఐస్ క్రీం విక్రేతలు ఎందుకు ప్రాంక్ లు చేస్తారు.. అవి ఎందుకు కరిగిపోవు?
టర్కిష్ ఐస్ క్రీం, ఇతర రకాల ఐస్ క్రీంలా కాకుండా, కాస్త గట్టిగా, జిగటగా ఉంటుంది.. సులభంగా కరగదు, కాబట్టి, ట్రిక్స్ చేయడానికి అనువైనది. టర్కిష్ ఐస్ క్రీం విక్రేతలు సాంప్రదాయ దుస్తులు ధరించి, వివిధ విన్యాసాలు చేస్తూ మీ దృష్టిని ఆకర్షించారు. ఈ విక్రేతలు ఇకపై టర్కీకి మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి ప్రధాన నగరాల్లోని ప్రతి సూపర్ మార్కెట్‌లో కనిపిస్తాయి. అయితే, ఐస్ క్రీం విలక్షణమైన విక్రయం ఆకట్టుకుంటుంది. కోన్ తీసుకునే సమయంలో చేసే ట్రిక్స్ చాలా బాగుంటాయి. మార్కెటింగ్ పద్ధతిలో భాగమైపోయింది.
ఇస్తాంబుల్‌లో ఐస్‌క్రీమ్ ట్రిక్ ప్రారంభించిన.. టర్కిష్ వ్యక్తి
2013లో ఇస్తాంబుల్‌కు చెందిన ఒక ఐస్‌క్రీమ్ విక్రేత తన విన్యాసాలతో దృష్టిని ఆకర్షించాడు. తన ట్రిక్స్ తో అతడు ఆకట్టుకోవడం మొదలుపెట్టారు. కస్టమర్‌లతో ఆడుకుంటూ ఐస్‌క్రీం విక్రయించే పద్ధతి ప్రారంభమైంది. వైరల్ అయిన ఒక వీడియో ద్వారా పాపులారిటీ వచ్చింది. ఆ తర్వాత చాలా మంది ఐస్ క్రీమ్ విక్రేతలు ఈ ట్రిక్స్ ను ఫాలో అయ్యారు. అతను మొదలు పెట్టిన చర్యలో ఒక కళా ఉందని ప్రపంచం గుర్తించింది. అతడు కొన్ని ట్రిక్స్ మొదట చేతులతో చేయగా.. ఆ తర్వాత మెటల్ పోల్ తో చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. టర్కిష్ ఐస్ క్రీం విక్రేతలు ఈ ట్రిక్స్ కు సంబంధించి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకున్నారు. ఆ తర్వాత ఈ తరహా ఐస్ క్రీం అమ్మడం సాధారణమైంది. ఐస్ క్రీమ్ కోన్, ఐస్ క్రీం ఒకదానితో ఒకటి అతుక్కుపోతాయి.. కానీ కింద చూస్తే మాత్రం చేతిలో ఉత్త కోన్ మాత్రమే ఉంటుంది. ఇలా చేయడానికి కూడా ఎంతో నైపుణ్యం అవసరమే..!
ఈ ట్రిక్స్ కాకుండా టర్కిష్ ఐస్ క్రీం స్పెషాలిటీ ఏమిటి?
ఇతర రకాల ఐస్ క్రీంలా కాకుండా, టర్కిష్ ఐస్ క్రీం జిగటగా ఉంటుంది. వెంటనే కరిగిపోదు. అందువల్లే ట్రిక్స్ చేయడానికి వీలు అవుతుంది. ఐస్ క్రీం బాగా ఉండాలంటే విక్రేత బకెట్‌లోని ఐస్‌క్రీమ్‌ను ఎప్పటికప్పుడు కలపాలి, అప్పుడే సర్వ్ చేసే సమయంలో ద్రవ ఆకృతిలో ఉంటుంది. ఫోర్క్, కత్తితో తినగలిగే ఏకైక ఐస్ క్రీం ఇది.
టర్కిష్ ఐస్ క్రీంను చాలా తక్కువ పదార్థాలతో తయారు చేస్తారు. వాటిలో చాలా వరకు మేక పాలు, సాలెప్ (నీలం కాండం పొడి), యాంగ్ సుగంధ ద్రవ్యాలు, చక్కెర వంటివి ఉంటాయి. సాలెప్ అనేది ఆర్చిడ్ యొక్క రైజోమ్ నుండి తీసుకోబడిన పొడి. ఈ ఒక రకమైన ఆర్చిడ్ ఇరాన్, టర్కీలో మాత్రమే కనిపిస్తుంది. సాలెప్ చాలా ఖరీదైనది. ఈ ఆర్కిడ్‌లు అంతరించిపోతున్న పూల జాతులలోకి చేరాయి. టర్కీ నుండి సాలెప్ ఎగుమతులు ప్రస్తుతం నిషేధించారు. హైదరాబాద్‌లోని టర్కిష్ విక్రేతలు సాలెప్ ప్రత్యమ్నాయాంతో ముందుకు వచ్చారు.
హైదరాబాద్‌లో టర్కిష్ ఐస్‌క్రీమ్ ఎక్కడ దొరుకుతుంది?
శరత్ సిటీ మాల్ ఫుడ్ కోర్ట్
ఇనార్బిట్ మాల్ ఫుడ్ కోర్ట్
FUMO GELATO ద్వారా టర్కిష్ ఐస్‌క్రీమ్, కొంపల్లి
టర్కిష్ ఐస్‌క్రీమ్, మేడ్చల్