ఐటీ ఉద్యోగులకు ఊరటనిచ్చే వార్త. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) దిల్‌సుఖ్‌నగర్ నుండి కోకాపేట్ సెజ్ వరకు నాలుగు కొత్త బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఈ మేరకు TSRTC మేనేజింగ్ డైరెక్టర్ V. C. సజ్జనార్ బుధవారం కొత్త బస్సుల వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఈ సర్వీసులు కోటి, నాంపల్లి, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, లంగర్ హౌజ్, టిప్పుఖాన్ బ్రిడ్జి, బండ్లగూడ, తారామతిపేట, నరిసింగి మీదుగా నడుస్తాయి. మొదటి బస్సు ఉదయం 6:00 గంటలకు దిల్‌సుఖ్‌నగర్ నుండి బయలుదేరుతుంది. చివరి బస్సు రాత్రి 8:40 గంటలకు బయలుదేరుతుంది.
సెప్టెంబర్ 10న కొత్త వాహనాలను ప్రవేశపెట్టింది ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ. ఈ నేపథ్యంలోనే దిల్‌సుఖ్‌నగర్-కోకాపేట్ మార్గంలో రద్దీని తగ్గించడానికి ప్రతి 40 నిమిషాలకు ఓ బస్సు చొప్పున నడుపుతుంది. మరిన్ని వివరాల కోసం 040-23450033/69440000 నంబర్లలో TSRTCని సంప్రదించవచ్చు.