జంట‌న‌గ‌ర‌ వాసుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త‌

TSRTC Reduced home delivery charges in Hyderabad.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)ఎండీగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  28 Nov 2021 7:34 AM GMT
జంట‌న‌గ‌ర‌ వాసుల‌కు టీఎస్ ఆర్టీసీ శుభ‌వార్త‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ)ఎండీగా స‌జ్జ‌నార్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచి ఆర్టీసీ స‌రికొత్త రూపును సంత‌రించుకుంది. న‌ష్టాల నుంచి లాభాలు సాధించే వైపుకు తీసుకువెళ్ల‌డం కోసం ఎప్పటిక‌ప్పుడు స‌రికొత్త నిర్ణ‌యాలు తీసుకుంటుంది. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. హోం డెలివ‌రీ పార్సీల్ చార్జీల‌ను త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. త‌గ్గించిన ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని పేర్కొంది. హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌లోని వినియోగ‌దారుల‌కు ఆకట్టుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ నిర్ణ‌యం తీసుకుంది.

స‌వ‌రించిన హోం డెలివ‌రీ చార్జీలు ఇలా..

- ఇప్పటివరకు 10 కిలోల లోపు ఉన్న పార్సిళ్లకు రూ. 80 ఉండ‌గా.. దానిని రూ.55కి

- 11 కేజీల నుంచి 30 కేజీల పారిల్స్‌కు రూ. 150 ఉండ‌గా.. రూ. 90 కి

- 31 కేజీల నుంచి 50 కేజీల పార్సిల్ ధర రూ. 225 ఉండ‌గా.. రూ.130 కి

- 51 నుంచి 100 కేజీల పార్సిల్ ధ‌ర రూ. 300 ఉండ‌గా.. రూ. 180కి త‌గ్గించారు.

500 గ్రాముల లోపు బరువు ఉండే పార్సిల్ కవర్లకు రూ.50 తీసుకుంటుండ‌గా.. రూ.15కు త‌గ్గించారు.

- కేజీలోపు బరువు ఉండే పార్సిళ్ల ఛార్జీలను రూ. 50 నుంచి రూ. 25కు తగ్గించినట్లు ఆర్టీసీ వెల్ల‌డించింది.

జంట న‌గ‌రాలు(హైద‌రాబాద్‌, సికింద్రాబాద్‌)లో వినియోగ‌దారుల‌కు మ‌రింత సౌల‌భ్యం కోసం నేరుగా హోం డెలివ‌రీ సేవ‌లు ప్రారంభించింది ఆర్టీసీ. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా జంట న‌గ‌రాల్లో హోం డెలివ‌రీ సేవ‌ల్ని పొందే అవ‌కాశం ఉంది.


Next Story