హైద‌రాబాద్‌లో అన్ని దారులు హుస్సేన్‌సాగర్‌ వైపే సాగుతున్నాయి. సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ కు భారీగా గణనాథులు చేరుకుంటున్నాయి. గ‌ణేష్ నిమజ్జనాలను వీక్షించేందుకు నగర ప్రజలు ట్యాంక్ బండ్ కు భారీగా తరలివస్తున్నారు. ట్యాంక్‌ బండ్ పరిసరాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. భారీగా పోలీసులు బందోబ‌స్తు ఏర్పాట్లు చేశారు.

ఇదిలా ఉంటే.. నిమ‌జ్జ‌నోత్స‌వంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. తన నివాసంలో పూజ చేసిన గణనాధుడిని ఆర్టీసీ బస్సులో నిమజ్జనానికి తీసుకొచ్చారు. కుటుంబ స‌భ్యుల‌తో కలిసి గణానాధుడి ప్రతిమతో బస్ లో కూర్చొన్నారు. సాంప్ర‌దాయ బ‌ద్దంగా వైట్ ఫైజమా, వైట్ టోపీ పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

తోట‌ వంశీ కుమార్‌

Next Story