టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు అభ్యర్థుల గెలుపు

TRS Part win yousufguda division I టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు అభ్యర్థుల గెలుపు

By సుభాష్  Published on  4 Dec 2020 12:48 PM IST
టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరు అభ్యర్థుల గెలుపు

గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక టీఆర్‌ఎస్‌ ఖాతాలో రెండు విజయాలు వచ్చి చేరాయి. తొలి విజయంగా యూసుఫ్‌గూడ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాజ్‌కుమార్‌ పటేల్‌ విజయం సాధించారు. మరో 57 డివిజన్లలో టీఆర్‌ఎస్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక యూసుఫ్‌గూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం సాధించడంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం పొంగిపోతోంది.

అలాగే మెట్టుగూడ డివిజన్‌ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌కు చెందిన ఆర్‌. సునీత విజయం సాధించారు. సునీత గెలుపుతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. అన్ని డివిజన్లలో దాదాపుగా టీఆర్‌ఎస్‌ ముందంజలో ఉండటంతో గులాబీ శ్రేణుల్లో ఆనందం ఉప్పొంగిపోతోంది. గ్రేటర్‌లో మేయర్‌ స్థానం తమదేనన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది.

Next Story