బీఎన్‌రెడ్డి న‌గ‌ర్‌లో రీకౌంటింగ్ కోరిన టీఆర్ఎస్‌

TRS Demand Recounting In BN Reddy Nagar. గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల ఓట్ల

By Medi Samrat  Published on  4 Dec 2020 1:47 PM GMT
బీఎన్‌రెడ్డి న‌గ‌ర్‌లో రీకౌంటింగ్ కోరిన టీఆర్ఎస్‌

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌(జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు తుది ద‌శ‌కు చేరుకుంటోంది. సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 108 స్థానాల‌లో ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. టీఆర్ఎస్ -42 స్థానాల‌లో, బీజేపీ -25, ఎంఐఎం-35 స్థానాల‌లో విజ‌యం సాధించాయి. కాంగ్రెస్ రెండుచోట్ల గెలుపొందింది. మిగ‌తా స్థానాల్లోనూ లెక్కింపు చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.

బీఎన్‌రెడ్డిన‌గ‌ర్ డివిజ‌న్‌లో తెరాస అభ్య‌ర్థి ల‌క్మీప్ర‌స‌న్న‌పై కేవ‌లం 10 ఓట్ల తేడాతో బీజేపీ అభ్య‌ర్థి ల‌చ్చిరెడ్డి విజ‌యం సాధించారు. దీనిపై టీఆర్ఎస్ అభ్య‌ర్థి అనుమానం వ్య‌క్తం చేశారు. తెరాస అభ్య‌ర్థి అభ్య‌ర్థ‌న మేర‌కు బీఎన్‌రెడ్డి న‌గ‌ర్‌లో అధికారులు రీ కౌంటింగ్ జ‌రుపుతున్నారు. ‌
Next Story