నువ్వేమో రూ.1300 కాపాడ‌దాం అనుకున్నావ్‌.. కానీ ఇంకో రూ.1500 ఎక్కువే ప‌డ్డాయి

Traffic police tweet about traffic rules violation.ట్రాఫిక్ రూల్స్‌ని బ్రేక్ చేసే వారు పైన్ త‌ప్పించుకోవ‌డానికి..త‌మ బండి నెంబ‌ర్ ఫ్లేట్ క‌నిపించ‌కుండా చాలా మార్గాల‌నే అనుస‌రిస్తున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Feb 2021 8:27 AM GMT
traffic rules violation

ట్రాఫిక్ రూల్స్‌ని బ్రేక్ చేసే వారు పైన్ త‌ప్పించుకోవ‌డానికి.. త‌మ బండి నెంబ‌ర్ ఫ్లేట్ క‌నిపించ‌కుండా చాలా మార్గాల‌నే అనుస‌రిస్తున్నారు. అయిన‌ప్ప‌టికి ట్రాఫిక్ పోలీసులు వారి ఎత్తును చిత్తు చేసి వారికి చ‌లానాల‌ను వేసిన ఘ‌ట‌న‌లు చూశాం. తాజాగా బైక్ పై ట్రిపుల్‌ రైడ్ వెలుతున్న వారు ఫైన్‌ను త‌ప్పించుకునేందుకు నెంబ‌ర్ ప్లేట్‌కు కాలును అడ్డంగా పెట్టారు. అయితే నగర పోలీసులు మాములు వారు కాదు కదా నెంబర్‌ను కవర్‌ చేస్తున్న ఫొటోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంతేనా.. పవన్‌ కళ్యాణ్‌ డైలాగ్‌ చెబుతున్నట్లున్న మీమ్‌ని కూడా జత చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ట్రాఫిక్ పోలీసులు షేర్ చేసిన ఫోటోలో ఓ బైక్‌ మీద ముగ్గురు ప్ర‌యాణిస్తున్నారు. బైక్ న‌డిపే వ్య‌క్తికి హెల్మెట్ ఉంది. దీంతో ట్రిపుల్ రైడింగ్‌కి చలానా ప‌డుతుంద‌ని బావించి.. బైక్ వెనుక కూర్చున్న మ‌హిళ అతి తెలివితో నంబ‌ర్ ప్లేట్ క‌నిపించ‌కుండా ఉండేందుకు త‌న కాలు పెట్టింది. ఇది కాస్తా ట్రాఫిక్‌ పోలీసుల కంట్లో పడింది. ఇంకేముంది వారు రంగంలోకి దిగి బైక్‌ నంబర్‌ ప్లేట్‌ని గుర్తించి.. కావాలని వాహనం సమాచారం దాచినందుకు రూ.500, ప్రమాదకర డ్రైవింగ్‌కు రూ.1,000, ట్రిపుల్‌ డ్రైవింగ్‌కు రూ.1,200 వెనక కూర్చున్న వారికి హెల్మెట్‌ లేనందుకు గాను రూ.100 రూపాయల చొప్పున మొత్తం 2,800 రూపాయల చలానా విధించారు.


'అత్తారింటికి దారేది' సినిమాలోని క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాన్ని ప్రస్తావిస్తూ.. 'నువ్వేమో రూ.1300 కాపాడదాం అని కాలు పెట్టావ్… కానీ నువ్వు చేసిన ఈ పనికి ఇంకో రూ.1500 ఎక్కువ పడ్డాయి' అంటూ కామెంట్ పెట్టారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
Next Story
Share it