బూటు కాలుతో తన్నుతూ ట్రాఫిక్‌ సీఐ వికృత చేష్టలు (వీడియో)

ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ.. కొన్ని చోట్ల మాత్రం వికృత చేష్టలతో భయపెడుతుంటారు.

By Srikanth Gundamalla  Published on  3 Sep 2023 11:06 AM GMT
Traffic CI, hitting, Private Bus Drivers, Hyderabad,

బూటు కాలుతో తన్నుతూ ట్రాఫిక్‌ సీఐ వికృత చేష్టలు (వీడియో)

ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ.. కొన్ని చోట్ల మాత్రం వికృత చేష్టలతో భయపెడుతుంటారు. చేసేది చిన్న తప్పే అయినా.. కొన్ని సందర్భాల్లో తప్పు లేకపోయినా దారుణంగా వ్యవహరిస్తారు. బూటు కాళ్లతో తంతూ.. దారుణంగా కొడుతూ హింసిస్తారు. తాజాగా జీడిమెట్లలో ట్రాఫిక్‌ సీఐకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ట్రావెల్స్‌ బస్సులను ఆపి.. డ్రైవర్‌ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు.

ఒకవైపు ఫ్రెండ్లీ పోలీసులమని చెప్పుకునే విధంగా ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటూ వారికి సహాయం చేయాలంటూ పోలీస్ శాఖ సూచిస్తోంది. మరోవైపు కొంతమంది పోలీస్ శాఖకు చెడ్డ పేరు వచ్చే విధంగా వ్యవహరిస్తూ ఉంటారు. వీరి వల్ల పోలీస్ శాఖకే చెడ్డపేరు వస్తోంది. రాత్రి వేళల్లో ట్రావెల్స్ బస్సులను ఆపి, డ్రైవర్లను కాలితో తన్నుతూ, బూతులు తిడుతూ ఇష్టం వచ్చినట్లు కొట్టి హింసిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారి హల్చల్ చేస్తున్నాయి. మేడ్చల్‌ ట్రాఫిక్‌ సీఐగా తెలుస్తోంది. ట్రాఫిక్ ను నియంత్రిస్తూ, వాహన దారుల పట్ల మర్యాదగా ప్రవర్తించాల్సిన ట్రాఫిక్ పోలీసులే వారి శాడిజాన్ని బస్సు డ్రైవర్లపై క్రూరంగా ప్రదర్శిస్తున్నారు. డ్రైవర్ తప్పిదం ఏమైనా ఉంటే, చలానా వేసి కేసులు పెట్టాల్సింది పోయి.. డబ్బుల కోసం హింసిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి 10 గంటల తర్వాత ట్రావెల్స్ బస్సులు తిరిగేందుకు అనుమతి ఉన్నా ...కేవలం డబ్బులు వసూలు చేసేందుకే ట్రాఫిక్ పోలీసులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Next Story