మామిడి పండ్లు కొంటున్నారా? జాగ్రత్త!

వేసవి కాలం ప్రారంభం కావడంతో మార్కెట్లోకి మామిడి పండ్లు వెల్లువలా వస్తున్నాయి. అయితే, లాభాపేక్షతో కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి...

By -  అంజి
Published on : 4 April 2026 8:08 AM IST

Food Adulteration, H-FAST Hyderabad Police, Chemically Ripened Mangoes, Calcium Carbide Danger, Public Health Safety, VC Sajjanar IPS, Food Safety Awareness, Artificial Ripening Warning

మామిడి పండ్లు కొంటున్నారా? జాగ్రత్త!

హైదరాబాద్‌: వేసవి కాలం ప్రారంభం కావడంతో మార్కెట్లోకి మామిడి పండ్లు వెల్లువలా వస్తున్నాయి. అయితే, లాభాపేక్షతో కొందరు వ్యాపారులు కాల్షియం కార్బైడ్ వంటి ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగించి మామిడి పండ్లను కృత్రిమంగా పండిస్తున్నారు. దీనిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలోని హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం ప్రత్యేక నిఘా ఉంచింది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

కృత్రిమంగా పండిన పండ్లు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా, బంగారు రంగులో కనిపిస్తాయని, కానీ అవి ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని కమిషనర్ పేర్కొన్నారు. సహజంగా పండిన పండులో రంగు అంతటా సమానంగా ఉండదు. దీనికి విరుద్ధంగా, రసాయనాలతో పండిన పండ్లు బయట పసుపు రంగులో ఉన్నా, లోపల మాత్రం పచ్చిగా, విషపూరితంగా ఉంటాయి. ఇలాంటి పండ్ల వల్ల గొంతు మంట, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో శ్వాసకోస, నాడీ వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కల్తీ పండ్ల సమాచారం తెలిస్తే ప్రజలు డైల్ 100 కు లేదా హెచ్-ఫాస్ట్ హెల్ప్‌లైన్ 8712661212 కు ఫిర్యాదు చేయాలని కోరారు. బేకింగ్ సోడా నీటితో కడిగినప్పుడు రంగు మారినా లేదా రసాయన వాసన వచ్చినా ఆ పండ్లను వాడకూడదని సూచించారు.

Next Story