హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక ముంబై ట్రైన్ ఎక్కిన ముగ్గురు బాలికలు.. చివరకు..

ఇంట్లో తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపిస్తామని బాలికలతో చెప్పారు.

By Srikanth Gundamalla  Published on  3 Sept 2024 10:30 AM IST
హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక ముంబై ట్రైన్ ఎక్కిన ముగ్గురు బాలికలు.. చివరకు..

ఇంట్లో తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపిస్తామని బాలికలతో చెప్పారు. అయితే.. ముగ్గురు బాలికలకు హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేదు. దాంతో.. వారు మాట్లాడుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. నేరుగా ముంబై ట్రైన్‌ ఎక్కారు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని కాలపత్తార్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు పిల్లలు కనిపించడం లేదని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాలపత్తార్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక ఏడో తరగతి పూర్తి చేసుకుంది. ఆమెను తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపాలని అనుకున్నారు. అదే ఇంట్లో అద్దెకు ఉంటోన్న మరో ఇద్దరు బాలికలను కూడా తల్లిదండ్రులు హాస్టల్‌కు పంపాలనీ.. ముగ్గురూ ఒకే చోట ఉండొచ్చని భావించారు. కానీ.. ఆ ముగ్గురు బాలికలకు హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేదు. దాంతో.. ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ముంబైకి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. సోమవారం ఎవరూ చూడని సమయంలో ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు.

కాసేపటికే ముగ్గురు పిల్లలు కనిపించకపోవడంతో కంగారుపడ్డారు తల్లిదండ్రులు. వెంటనే పోలీసులకు సమచారాం అందించారు. మధ్యాహ్నం 2 గంటలకు రంగంలోకి దిగిన పోలీసులు కొద్ది గంటల్లోనే ముగ్గురు బాలికలను గుర్తించారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడి.. గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాలను చెక్‌ చేశారు. చివరకు ముగ్గురినీ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ఉన్న ముంబై వెళ్తున్న ట్రైన్‌ ఎక్కినట్లు గుర్తించారు. వారిని తీసుకుని వెళ్లారు. ఆ తర్వాత తమతమ తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు.

Next Story