N-కన్వెన్షన్ కూల్చివేత.. అభిమానులకు నాగార్జున అభ్యర్థన ఇదే
మాదాపూర్‌లోని ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను శనివారం హైడ్రా కూల్చివేసింది.
By అంజి Published on 25 Aug 2024 1:48 PM GMTN-కన్వెన్షన్ కూల్చివేత.. అభిమానులకు నాగార్జున అభ్యర్థన ఇదే
హైదరాబాద్: మాదాపూర్‌లోని ప్రముఖ టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను శనివారం హైడ్రా కూల్చివేసింది. ఈ విషయమై నాగార్జున తన కన్వెన్షన్ సెంటర్‌ను చట్టవిరుద్ధంగా కూల్చివేశారని, ఇది తనను బాధించిందని, కోర్టు నుండి తగిన ఉపశమనం పొందుతానని చెప్పాడు. ఆ తర్వాత కూల్చివేతను నిలిపివేస్తూ శనివారం మధ్యాహ్నం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
తాజాగా అక్కినేని నాగార్జున ఎక్స్ పోస్ట్‌లో.. N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు. వీటిని నమ్మకూడదని అభిమానులకు, శ్రేయోభిలాషులకు విజ్ఞప్తి చేశారు.
''కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదని స్పెషల్ కోర్ట్, AP Land Grabbing (Prohibition) Act, 24-02-2014న ఒక ఆర్డర్ Sr 3943/2011 ద్వారా జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం, నిర్మాణం చట్టబద్ధతపై నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టుని ఆశ్రయించటం జరిగింది. న్యాయస్థానం తీర్పుకి నేను కట్టుబడి ఉంటాను. అప్పటి వరకు, ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దని నేను మిమ్మల్ని సవినయంగా అభ్యర్ధిస్తున్నాను'' నాగార్జున తన ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రియమైన అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ,N-కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే, ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయి . కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంటెడ్ భూమి. ఒక్క సెంట్ భూమి కూడా ఆక్రమించింది కాదు. తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు…
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024